• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • A PSYCHO GOT TWO MARRIGE AND KILLED THEM ONE BY ONE IN WARANGAL VRY

Murder : సైకోకు రెండు పెళ్లిల్లు, భార్యను చంపి ఇంట్లోనే ఖననం..! మరో భార్యను సైతం...

Murder : సైకోకు రెండు పెళ్లిల్లు, భార్యను చంపి ఇంట్లోనే ఖననం..! మరో భార్యను సైతం...

ప్రతీకాత్మక చిత్రం

Murder : వాడు సైకో అయినా రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు. తల్లిడండ్రులు వాడి చేష్టలకు విసుగు చెంది వదిలేస్తే...పోలీసులు పట్టించుకున్నారు..ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు..అయినా అక్కడి నుండి తప్పించుకుని రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు..అనంతరం ఒకరి వెనక ఒకరిని హత్య చేసి కటకటాలపాలు అయ్యాడు.

  • Share this:
వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏనుగల్లుకు చెందిన వ్యక్తి పది సంవత్సరాల క్రితం ఒక మహిళను పెళ్లి చేసుకుని హత్య చేశాడు. ఆ తర్వాత మరొక మహిళను పెళ్లాడి ఆమెను కూడా చంపేశాడు. రెండో భార్య కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు చేసిన విచారణలో.. మొదటి భార్యను ఆరేళ్ల క్రితం హత్య చేసిన విషయం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసుల కథనం,ప్రకారం

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏనుగల్లుకు చెందిన కర్నె కిరణ్‌ను అతని చేష్టలతో అతని తల్లిదండ్రులే వదిలిపెట్టారు. దీంతో ఓ అనాథ వెంటబడి ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఊరితో పాటు ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ ఆవారాగా తిరుగడంతో పెళ్లి చేయకుండా కిరణ్ వదిలివేశారు. దీంతో ఎనుగల్లుకు చెందిన ఓ అనాథ మహిళను ప్రేమించానంటూ వెంటపడి ఎనిమిది సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన సైకో ఇజాన్ని బయటపెట్టిన కిరణ్ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టాడు.

అయితే అనాథ కావడంతో హత్య కేసును ఎవరు పట్టించుకోలేదు. విషయం పోలీసులకు కూడ తెలియలేదు. అయితే సైకో చేష్టలకు విసిగిపోయిన పోలీసులే చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్సకు పంపించారు. అయితే చికిత్స తీసుకుంటూనే కిరణ్ ఆసుపత్రి నుండి తప్పించుకుని పారిపోయాడు. అక్కడి నుండి స్వగ్రామం వెళితే పోలీసులు పట్టుకుంటారని భావించిన కిరణ్ హుజురాబాద్‌కు చేరుకున్నాడు.

ఇక హుజురాబాద్‌లో తన ప్రతాపం చూపించాడు. అక్కడే ఉంటూ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్‌కు చెందిన అంజలీ బాయి నర్సుగా పనిచేస్తుంది.. ఆమెను రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె ఇంట్లోనే కాపురం పెట్టాడు. పెళ్లి అనంతరం కొద్ది రోజులు హుజురాబాద్‌లో ఉండి ఆరు నెలల క్రితం తన స్వగ్రామం అయిన ఏనుగల్లుకు చేరుకున్నాడు. అప్పటి నుండి తన వికృత చేష్టలకు తెరలేపాడు. రెండవ భార్యను సైతం వేధింపులకు గురి చేశాడు. అంజలీ బాయి ఇంటిని అమ్మి డబ్బులు తేవాలంటూ వేధింపులు మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 13న తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరునాడు ప్రాణాలు విడిచింది.

అంజలీ బాయి మృతితో ఆమె తల్లి భాగ్యలక్ష్మి అనుమానాలు వ్యక్తం చేసింది. విచారణ చేపట్టాలని కేసును నమోదు చేయించింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ చేసింది ఒకరు కాదు ఇద్దరిని హత్య చేశారని తేలింది. తన పోలీసుల విచారణ తన మొదటి భార్యను సైతం చంపి తన స్వంత ఇంట్లోనే పాతి పెట్టినట్టు వివరించాడు. దీంతో నేడు పోలీసులు మొదటి భార్య శవాన్ని వెలికి తీయనున్నట్టు తెలుస్తోంది.
Published by:yveerash yveerash
First published: