Home /News /telangana /

A PROFESSOR FROM TELANGANA INTRODUCES AN INNOVATIVE TECHNOLOGY TO PRESERVE ANCIENT PALM LEAF MANUSCRIPTS THROUGH ARTIFICIAL INTELLIGENCE GH SRD

Palm Leaf Manuscripts: తెలంగాణ ప్రొఫెసర్ అద్భుత ఆవిష్కరణ.. ఏంటో తెలిస్తే శభాష్ అంటారు..

Palm Leaf Manuscripts (PC : EPS)

Palm Leaf Manuscripts (PC : EPS)

Palm Leaf Manuscripts: మన పూర్వీకులు ఖగోళ శాస్త్రం, ఆర్కిటెక్చర్, లా, సంగీతం, వైద్యం వంటి అనేక సబ్జెక్టులకు సంబంధించి తాళపత్రాల్లో ఎన్నో విషయాలు రాశారు. అయితే ఈ పురాతనమైన తాళపత్రాలు వివిధ వాతావరణ పరిస్థితులు, దుమ్ము వంటి అనేక కారణాల చెరిగిపోవడం లేదా చిరిగిపోవడం జరిగింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
తాళపత్ర గ్రంథాలను భద్రపర్చడానికి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) ప్రొఫెసర్ డాక్టర్ పాణ్యం నరహరి శాస్త్రి. తాళపత్ర గ్రంథాలలోని (Palm Leaf Manuscripts) అక్షరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించడానికి స్పెషల్ 3D ఫీచర్‌ ఉన్న ఇన్నోవేటివ్ టెక్నాలజీని ఆయన అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణకు గాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (Telangana State Innovation Cell) ఆయన్ను సత్కరించింది. ఎంతో విలువైన పురాతన చరిత్ర, సంస్కృతి, భాషలను నేటి ప్రజలకు తెలిపేవే తాళపత్ర గ్రంథాలు. అయితే ఇందులో రాసి ఉన్న భాషలు, గుర్తులు అర్థం చేసుకోవడం అంత సులువేం కాదు.

దీనికితోడు అవి పాడు కావడం వల్ల అందులోని అక్షరాలు గుర్తించడం కష్టంగా మారింది. అయితే డా.నరహరి శాస్త్రి ఈ పనిని సరికొత్త టెక్నాలజీ ద్వారా సులభతరం చేశారు. జులైలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా ద్వారా 3D టెక్నిక్‌కు పేటెంట్ మంజూరు చేసిన CBIT ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.వి.కోటేశ్వరరావు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.కృష్ణన్‌ల సహకారంతో ఈ ప్రాజెక్ట్ జరిగింది.

మన పూర్వీకులు ఖగోళ శాస్త్రం, ఆర్కిటెక్చర్, లా, సంగీతం, వైద్యం వంటి అనేక సబ్జెక్టులకు సంబంధించి తాళపత్రాల్లో ఎన్నో విషయాలు రాశారు. అయితే ఈ పురాతనమైన తాళపత్రాలు వివిధ వాతావరణ పరిస్థితులు, దుమ్ము వంటి అనేక కారణాల చెరిగిపోవడం లేదా చిరిగిపోవడం జరిగింది. దీంతో కొన్ని అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు. ఫలితంగా వీటిని అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇవి మరింత డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి వాటిని సంరక్షించడానికి డిజిటలైజేషన్ చేయడం అత్యవసరంగా మారింది.

అయితే వీటిని స్కాన్ చేసి డిజిటల్‌గా స్టోర్ చేయడం వల్ల ఎక్కువగా ఉపయోగాలు ఉండటం లేదు. డాక్టర్ నరహరి సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఆయన మాట్లాడుతూ... “ఈ తాళపత్రాల గ్రంథాలు స్కాన్ చేయడం సరైన పద్ధతి కాదు, ఎందుకంటే అవి కాగితంపై నల్లటి మచ్చలు పడేలా చేస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి, తాళపత్రాలపై రాసిన ప్రత్యేక అక్షరాలను గుర్తించేలా మేం కంప్యూటర్‌కు కావలసిన టెక్నిక్స్ నేర్పించాం,” అని చెప్పారు.

ఇది కూాడా చదవండి :  బాప్ రే.. ఇంటర్నెట్‌లో ప్రతి 10 మందిలో ఆరుగురు తెలుసుకుంటుంది ఇదా..!

తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని కంప్యూటర్ గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక త్రీడీ ఫీచర్‌ను ఆయన ప్రవేశపెట్టారు. “తాళపత్ర రచయితలు ఏ లేఖపై ఎంత ఒత్తిడి తెచ్చారో గుర్తించడానికి మేం డేటాబేస్‌ను ఉపయోగించాం. చెదపురుగులు లేదా ఎలుకలు తిన్న అక్షరాలను గుర్తించడానికి ఇది కంప్యూటర్‌కు సహాయపడింది,” అని వివరించారు.

ఈ టెక్నాలజీ అభివృద్ధి కోసం తిరుపతికి చెందిన ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తనకు తాళపత్రాలు అందించారని తెలిపారు. ఎప్పుడూ ఫాలో అయ్యే స్కానింగ్ పద్ధతి కాకుండా.. వీటిలోని అక్షరాలను స్కాన్ చేయడానికి, కంప్యూటింగ్ పరికరంలోకి ఇన్‌పుట్ చేయడానికి టెఫ్లాన్-ఆధారిత సూది ఉపయోగించినట్లు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్‌ల వాడటం వల్ల 95 శాతం కచ్చితత్వంతో అక్షరాలను గుర్తించడం సాధ్యమైందన్నారు.

డాక్టర్ నరహరి బృందం ఈ ప్రాజెక్ట్ కోసం ఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి రూ.7,31,000 నిధిని అందుకుంది. ఇప్పుడు దాని కాన్సెప్ట్‌ను మరింత అభివృద్ధి చేయడానికి మైక్రోసాఫ్ట్, హెచ్‌పీతో జతకట్టడానికి ప్రయత్నిస్తోంది. “టెక్నాలజీ ఇప్పటికే తీసుకు రావడం జరిగింది. మేం ఇప్పుడు దానిని మరింత మెరుగు పరచాలి. ఇందుకు మరిన్ని పరికరాలు కావాలి’’ అని డాక్టర్ నరహరి వివరించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Hyderabad, National News, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు