మాతృత్వపు మాధూర్యాన్ని ఆస్వాదించడం కోసం పెళ్లయిన ప్రతీ మహిళ (Women) పరితపిస్తుంది. పెళ్లయి ఏళ్లు గడిచినా గర్భందాల్చక వేలాది మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ తన కడుపులో పసికందుకు ప్రాణం పోసిన ఆ తల్లి.. నవమాసాలు మోసింది. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని, మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమో అన్న చిన్న అనుమానంతో.. తెల్లారితే లోకం చూడాల్సిన శిశువుతో (Baby) సహా తనూ ప్రాణం తీసుకుంది. పోస్టుమార్టంలో కడుపులో ఉన్నది మగబిడ్డే అని తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నాలుగేళ్ల క్రితం పెళ్లి..
మంచిర్యాల జిల్లాలోని (Mancherial District) దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన పులిశెట్టి గంగన్న-శ్యామల రెండో కూతురు రమ్య (Ramya) ను... మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఎగ్గెన ఆనంద్ (Anand)కు ఇచ్చి నాలుగేళ్ల కిందట పెళ్లి చేశారు. వారికి రెండేళ్ల క్రితం ఆరాధ్య పుట్టింది. ప్రస్తుతం రమ్య తొమ్మిది నెలల గర్భిణి (9 Months Pregnant).. వైద్య చికిత్సలకు వెళ్లిన ప్రతిసారి అత్తింటి వారు మళ్లీ ఆడపిల్ల పుడితే ఎలా అంటూ పదే పదే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయంపై అనుమానం (Doubt) పెంచుకున్న రమ్య.. డెలివరీ తేదీకి ఒక్కరోజు ముందు (Delivery before day) ఆత్మహత్య చేసుకుంది. ఈనెల 6న కాన్పు ఉండడంతో మళ్లీ ఆడపిల్ల పుడితే ఇబ్బందులు తప్పవని భావించిన రమ్య బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
ఓ వైద్యుడి సమాచారంతో..
రమ్య ఆత్మహత్య (Ramya Suicide)కు అత్తవారింటి తరఫు బంధువైన ఓ వైద్యుడి (Doctor) తప్పుడు సమాచారమే కారణమని ఆరోపిస్తున్నారు రమ్య బంధువులు. అతని సమాచారంతోపాటు అత్తింటివారి వేధింపుల కారణంగా రమ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: వనమా రాఘవను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ.. పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో చర్యలు
బంధువుల రోదనలు..
కొద్ది గంటల్లో శిశువు (baby)కు ప్రాణం పోయాల్సిన ఆ తల్లి.. బిడ్డతోపాటు తన నిండు ప్రాణాలను తీసుకోవడంపై అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయ్యో తల్లి ఎంత పని చేసావంటూ బంధువులు (Relatives), గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మృతిచెందిన శిశువు..
రమ్య ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రమ్య కడుపులో నుంచి మృతి చెందిన మగ శిశువును వైద్యులు వెలికితీశారు. ఆడపిల్ల పుడుతుందనుకొని ఆత్మహత్య చేసుకున్నదని, గర్భంలో మగబిడ్డ ఉన్నదని తెలిస్తే తమకు కడుపుకోత మిగిల్చేది కాదని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. రమ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mancherial, Women suicide