• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • A POT FILLED WITH GOLD AND SILVER ORNAMENTS UNEARTHED IN PEMBARTHY OF JANGAON DISTRICT SK

Telangana: రైతు పొలంలో లంకె బిందె.. తెరిచి చూస్తే బంగారం ధగధగలు.. ఎంతుందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

జనగామ జిల్లాలో ఓ లంకె బిందె బయటపడింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే నిండా ఆభరణాలే కనిపించాయి. దేవతా విగ్రహానికి అలంకరించే నగలు పెద్ద మొత్తంలో బయటపడ్డాయి.

  • Share this:
    లంకె బిందెలు.. ఈ మిస్టరీ సబ్జెక్ట్ ఎప్పుడూ ఆసక్తికరమే. తెలుగు రాష్ట్రాల్లో గుప్తనిధుల కోసం దేవాలయాల సమీపంలో దుండగులు భూములను తవ్వే ఘటనలను టీవీల్లో చాలానే చూశాం. కానీ ఇలాంటి పని గట్టుకొని తవ్వితే ఎక్కడా గుప్త నిధులు బయట పడడం లేదు. ఐతే అనుకోకుండా భూమిని తవ్వితేనో.. లేదంటే చదును చేస్తుంటేనో.. లంకె బిందెలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ లంకె బిందె బయటపడింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే నిండా ఆభరణాలే కనిపించాయి. దేవతా విగ్రహానికి అలంకరించే నగలు పెద్ద మొత్తంలో బయటపడ్డాయి. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

    హైదరాబాద్‌కు చెందిన నర్సింహ వ్యవసాయం చేస్తూనే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే జనగామ జిల్లా పెంబర్తి గ్రామ పరిధిలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి సమీపంలో ఓ రైతు నుంచి 11 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అక్కడ వెంచర్ ఏర్పాటు చేసేందుకు భూమిని చదును చేస్తున్నారు. గురువారం ట్రాక్టర్‌తో చదువును చేస్తున్న సమయంలో..దానికి ఏదో వస్తువు తగిలింది. ట్రాక్టర్‌ను లాగగా ఓ బిందె బయటపడింది. ఐతే ట్రాక్టర్‌తో ఒక్కసారిగా లాగడంతో ఆ బిందె పగిలిపోయింది. అందులో ఏమున్నాయని.. దగ్గరికి వెళ్లి చూస్తే ఆభరణాలు కనిపించాయి. బంగారంతో పాటు వెండితో నగలు ఉన్నాయి. అమ్మవారి పుస్తెలు, మెట్టెలు, కడేలు, గాజులు ఉండడంతో.. భూమి యజమాని నర్సింహతో పాటు స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.



    పోలీసులతో పాటు అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తహశీల్దార్ రవీందర్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. లంకె బిందెలో 11 తులాల బంగారంతో పాటు 10 కిలోల వెండి లభ్యమయిందని అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులుగా తనకు కలలో అమ్మవారు వస్తున్నారని.. ఈ స్థలంలో గుడి కడతానని భూమి యజమాని నర్సింహ చెప్పారు. ఐతై ఇక్కడ మరిన్ని గుప్త నిధులు ఉండే అవకాశం ఉందని.. కాకతీయ రాజుల సమయంలో లంకె బిందెలను పూడ్చి పెట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చుట్టుపక్కల తవ్వితే మరిన్ని నిధులు బయటపడవచ్చని అభిప్రాయపడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: