హోమ్ /వార్తలు /తెలంగాణ /

పాము కాటుతో పొలంలోనే ప్రాణాలు విడిచిన ఎద్దు.. కన్నీరుమున్నీరుగా విలపించిన రైతు

పాము కాటుతో పొలంలోనే ప్రాణాలు విడిచిన ఎద్దు.. కన్నీరుమున్నీరుగా విలపించిన రైతు

చనిపోయిన ఎద్దు వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న రైతు కుటుంబం

చనిపోయిన ఎద్దు వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న రైతు కుటుంబం

ఓ రైతు తను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఎద్దును కళ్లెదుటే కోల్పోయాడు. రోజూ వ్యవసాయానికి తనతోపాటు వచ్చే ఎద్దు ఇకపై లేదని తెలిసి గుండెలు బాదుకున్నాడు. ఆ రైతు భార్య బాధ అయితే వర్ణానాతీతం. ఎద్దుపై పడి కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. కుటుంబ సభ్యుల్లో ఎవరో చనిపోయారన్నంతగా వారు బాధపడుతున్న తీరు, తోటి రైతులను, గ్రామస్తులను కలచివేసింది.

ఇంకా చదవండి ...

వ్యవసాయం చేసే రైతుకే ఎద్దు విలువ తెలుస్తుంది. అందుకే వ్యవసాయ కుటుంబాల్లో ఇప్పటికీ ఎద్దులను సాకడం తమ దైనందిన జీవితంలో అలవాటుగా చేసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పనిచేసిన పంటలో నష్టం వచ్చినా, ప్రాణంగా చూసుకునే ఎద్దును కోల్పోయినా ఆ రైతు కంట కన్నీటవర్షం కురుస్తుంది. సాగులో సగం భారాన్ని మోస్తూ వ్యవసాయ పనుల్లో యజమానికి చేదోడు వాదోడుగా నిలిచే ఎద్దును కోల్పోతే ఆ రైతుకు చేయి విరిగినట్టే. తాజాగా కొమరం భీం అసీఫాబాద్ జిల్లాలో అదే జరిగింది. ఓ రైతు తను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఎద్దును కళ్లెదుటే కోల్పోయాడు. రోజూ వ్యవసాయానికి తనతోపాటు వచ్చే ఎద్దు ఇకపై లేదని తెలిసి గుండెలు బాదుకున్నాడు. ఆ రైతు భార్య బాధ అయితే వర్ణానాతీతం. ఎద్దుపై పడి కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. కుటుంబ సభ్యుల్లో ఎవరో చనిపోయారన్నంతగా వారు బాధపడుతున్న తీరు, తోటి రైతులను, గ్రామస్తులను కలచివేసింది. విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పారా గ్రామానికి చెందిన మెస్రం సూక్ లాల్ ఓ గిరిజన రైతు. తనకు ఉన్న కొద్ది పాటి పొలంలో వ్యవసాయం చేస్తుండేవాడు. వ్యవసాయం పైనే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. అయితే ఆదివారం పొలం పనుల్లో ఉండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఉదయం మేతకు వెళ్లిన వారి ఎద్దు పాము కాటుకు గురయింది. దీంతో ఆ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు మరణించిన సంగతిని గ్రహించిన మెస్రం సూక్ లాల్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఎద్దుపై చేతితో ప్రేమగా నిమురుతూ కన్నీరుమున్నీరుగా ఏడ్చాడు. రైతు భార్య అయితే ఆ ఎద్దుపై పడి తీవ్రంగా విలపించింది. తమ కుటుంబ సభ్యుడిలా ఎద్దును చూసుకున్నామనీ, అదే తమకు వ్యవసాయ పనుల్లో జీవనాధారమని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. వారి ఆవేదనను చూసిన స్థానికులకు గుండె తరుక్కుపోయింది.

ఎద్దు మృతితో తమ జీవనాధారం కోల్పోయినట్లైందని, ఐటీడీఏ అధికారులు తమను ఆదుకోవాలని ఆ రైతు కుటుంబం వేడుకుంటోంది. కాగా, గతంలో సిద్ధిపేట జిల్లాలోనూ ఇలాంటి దుర్ఘటనే చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురయి కూరెళ్ల గ్రామంలో శ్రీశైలం అనే రైతుకు చెందిన ఎద్దు మరణించింది. వారి ఆవేదనను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని అమెరికాలోని న్యూజెర్సీలో ఉండే ప్రభాకర్ రెడ్డి అనే ఎన్నారై చూసి స్పందించారు. తన స్నేహితుడిని ఆ రైతు వద్దకు స్వయంగా పంపి, 20 వేల రూపాయలు ఇప్పించాడు. ఆ డబ్బుతో మరో ఎద్దును కొనుక్కోవాల్సిందిగా రైతుకు సూచించాడు. తమ కుటుంబాన్ని ఆదుకున్న ప్రభాకర్ రెడ్డికి ఆ రైతు కుటుంబం ధన్యవాదాలు చెప్పింది. తాజాగా, మెస్రం సూక్ లాల్ కుటుంబాన్ని కూడా ఎవరైనా దయార్థ్ర హృదయులు అండగా నిలిచి ఆదుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.

First published:

Tags: Farmer, Farmers Protest, Farmers suicide

ఉత్తమ కథలు