హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: పాలమూరులో మానవమృగం.. అభాగ్యురాలిని నిర్భంధించి మూడు నెలలుగా అత్యాచారం.. 

OMG: పాలమూరులో మానవమృగం.. అభాగ్యురాలిని నిర్భంధించి మూడు నెలలుగా అత్యాచారం.. 

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఓ రాజకీయ నాయకుడు, గ్రామ సర్పంచి తండ్రి (Surpanch Father) ఆ ప్రాజెక్టులో భూములు, ఇల్లు కోల్పోయిన వారికి సహకరించేది పోయి వారికి ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బులను తీసుకొని దారుణానికి పాల్పడ్డారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Sayyad rafi, News 18, Mahbubanagr)


  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న నీటి డ్యాంలలో పాలమూరు రంగారెడ్డి (Palamuru Rangareddy) అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓ రాజకీయ నాయకుడు, గ్రామ సర్పంచి తండ్రి (Surpanch Father) ఆ ప్రాజెక్టులో భూములు, ఇల్లు కోల్పోయిన వారికి సహకరించేది పోయి వారికి ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బులను తీసుకొని దారుణానికి పాల్పడ్డారు. మళ్ళీ అడిగితే చంపుతానని బెదిరించి ఓ మహిళను మూడు నెలలు నిర్బంధించారు. అంతేకాదు ఆబాధితురాలిపై అత్యాచారం (Rape) చేశాడు. ఈ ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో గల నాగర్​కర్నూల్​ (NagarKurnool) బిజినపల్లి మండలం లో ఆలస్యంగా వెలుగు చూసింది.


  బిజినపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కృష్ణ ఓబుల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బిజినపల్లి మండలానికి చెందిన ఓ మహిళ కారుకొండ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచి తండ్రి ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఆమెకు కొద్దిగా వ్యవసాయ పొలం ఉండేది. పాలమూరు రంగారెడ్డి జలాశయం నిర్మాణంలో ముంపునకు గురవడం తో రూ 22 లక్షల పరిహారం ఆమెకు మంజూరు అయింది. ఆ డబ్బులపై కన్నేసిన కారకొండ సర్పంచి తండ్రి మిద్దె బాలస్వామి మాయ మాటలు చెప్పి 2020 నుంచి పలు దఫాలుగా రూ 18.50 లక్షలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. తిరిగి ఆ డబ్బులు చెల్లించాలని ఆ మహిళ బాలస్వామిని గట్టిగా నిలదీసింది. మార్చి నెలలో బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో ఆ మహిళ  ఫిర్యాదు సైతం చేసింది.  కేసు పెట్టడంతో బాలస్వామి ఆమె డబ్బులు తిరిగి ఇస్తానని ఒప్పుకున్నాడు. అనంతరం ఇవ్వకుండా దాటవేశాడు. అయితే మే నెలలో డబ్బులు అడగడంతో బాధితురాలి భర్తను కొట్టి చంపేస్తానని బెదిరించాడు. అంతేకాక ఆమెను అపహరించి బిజినపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో నిర్బంధించాడు. దానితోపాటు మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే మీ అందరి ప్రాణాలు తీస్తానని కుటుంబ సభ్యులను బెదిరించాడు. చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  పోలీసులు విచారణ జరిపి బాలస్వామి పై 324, 420, 376 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని రిమాండ్ కి పంపిస్తామని పోలీసులు పేర్కొన్నారు.


  గతంలో..


  ఓ ఫ్యాక్టరీ ఆవరణలోని ఇద్దరు మహిళలను అక్రమంగా నిర్బంధించి యజమాని వారిపై పదేపదే అత్యాచారం జరిపిన దారుణ ఘటన హర్యానాలో కర్నాల్ లో గతంలో వెలుగుచూసింది. స్థానిక పైపుల ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లోని విష్ణు దాస్ మేనేజర్ గా ఉన్నారు. అయితే అదే ఫ్యాక్టరీ గోడౌన్ లో పనిచేసే బబితా రాణి ( పేరుమార్పు), సుమిత్రా ( పేరుమార్పు)లపై కన్నేశాడు విష్ణుదాస్. అంతేకాదు ఇద్దరు మహిళలను నిర్బంధించి పలుసార్లు అత్యాచారం చేశాడని ఇద్దరు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Mahbubnagar, Nagarkurnool, RAPE

  ఉత్తమ కథలు