Home /News /telangana /

A POLICEMAN CAUGHT AS HE WAS MOVING ILLEGAL LIQUOR IN A BOLERO VEHICLE

బొలెరో వాహనం నిండా అవే.. రూ.9.50 లక్షల మద్యం స్వాధీనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాహనంలో 97 పెట్టెల్లో క్వార్టర్ బాటిళ్లు ఉన్నాయి. ఒక్కో పెట్టెలో 48 క్వార్టర్ బాటిళ్లు ఉండగా, వీటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మద్యాన్ని తరలించేందుకు ఉపయోగించిన టీఎస్ 28 టీ 4345 నంబరు గల బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు.

ఇంకా చదవండి ...
    ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. ఓ వ్యక్తి బొలెరో వాహనంలో రూ.9.50 లక్షల విలువైన మద్యాన్ని తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని దుబ్బతండాకు చెందిన భూక్య వెంకన్న బుధవారం రాత్రి పెద్దఎత్తున మద్యాన్ని తరలించేందుకు తన ఇంటి వద్ద బొలెరో వాహనంలో మద్యం బాటిళ్లను దిగుమతి చేస్తున్నాడు విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్‌హెచ్ఓ రోహిత్ రాజు తన సిబ్బందితో కలిసి దాడి చేశాడు. మొత్తం వాహనంలో 97 పెట్టెల్లో క్వార్టర్ బాటిళ్లు ఉన్నాయి. ఒక్కో పెట్టెలో 48 క్వార్టర్ బాటిళ్లు ఉండగా, వీటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మద్యాన్ని తరలించేందుకు ఉపయోగించిన టీఎస్ 28 టీ 4345 నంబరు గల బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ సుమారు రూ.9.50 లక్షల ఉంటుందని, మద్యాన్ని పాల్వంచ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ నుంచి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Badradri, Liquor, Police

    తదుపరి వార్తలు