Home /News /telangana /

A POLICE CONSTABLE OPENLY INSULTED ANOTHER CONSTABLE IN A DISPUTE IN A POLICE STATION UNDER RANGA REDDY DISTRICT MBNR PRV

Hyderabad: పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​ వీరంగం.. ఎస్సై కూడా ఏం పీకలేడంటూ వార్నింగ్​..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

క్రమశిక్షణకు మారుపేరు అంటేనే పోలీసు శాఖ (Police Department).. సదరు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ (Constable) గా వృత్తి నిర్వహిస్తూ ఓ వీధి రౌడీల తాగి అల్లరి చిల్లరగా తోటి కానిస్టేబుల్ ను బెదిరిస్తూ నానా హంగామా చేసిన కానిస్టేబుల్ ఉదంతం ఇది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (Sayyad Rafi, News18, Mahbubnagar)

    క్రమశిక్షణకు మారుపేరు అంటేనే పోలీసు శాఖ (Police Department).. సదరు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ (Constable) గా వృత్తి నిర్వహిస్తూ ఓ వీధి రౌడీల తాగి అల్లరి చిల్లరగా తోటి కానిస్టేబుల్ ను బెదిరిస్తూ నానా హంగామా చేసిన కానిస్టేబుల్ ఉదంతం ఇది. సైబరాబాద్ (Cyberabad) పరిధిలోని రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు పోలీస్ స్టేషన్లో (Police station) విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ తన తోటి కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిని బూతులతో తిట్ల దండకం మొదలుపెట్టాడు. మీడియాలో రాయజాలని భాషలో శ్రీనివాస్  తిట్లను చూసి ఇతరులు అవాక్కయ్యారు. అంతటితో ఆగకుండా కొందరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి శ్రీనివాస్ నానా యాగి చేశాడు. తోటి కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిని నువ్వు ఎంత నీ బతుకెంత అంటూ బూతులు తిడుతూ తనకే ఎదురు చెబుతావా? అంటూ బెదిరించాడు. సిబ్బంది ఆపిన ఆగలేదు. నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నెలకొన్నట్టు విశ్వసనీయ సమాచారం.

    Rajanna Sircilla: వామ్మో.. ఈమె మామూలు లేడీ కాదు.. స్నేహితులతో కలిసి భర్తను ఏం చేసిందో తెలుసా?

    కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా తోటి కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిని ఫోన్ ద్వారా వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ చంపుతానంటూ బెదిరించాడు. అంతేకాదు ఈ విషయం ఎవరికీ చెబుతావో చెప్పుకో ఎస్సై కూడా ఏమీ పీకలేడు అంటూ రాద్ధాంతం చేశాడు. పోలీసు అంటేనే రక్షణ కవచం.. పదిమందికి మంచి మార్గం చూపెడుతూ వారికి రక్షణ కల్పించాలి, శాంతి భద్రతలను కాపాడాలి. ఇవన్నీ పక్కనపెట్టి చిత్తుగా మద్యం తాగి నానా హంగామా చేసిన వ్యవహారంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.


     అసలు ఎందుకు రగడ?

    నిన్న కొందరు​ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మద్యం తాగి బైకుపై వాహనదారుల రాకపోకలకు హంగామా సృష్టించాడు. అయితే బాధితులు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా అతని వాహనం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఫోన్ చేసిన సదరు కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ బైకు వదిలేయాలంటూ డ్యూటీలో ఉన్న శ్రీధర్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చారు. బైకు వదలనందుకు శ్రీనివాస్ నోటి దురుసు ప్రవర్తించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ ఫోన్లో శ్రీధర్ రెడ్డిని పలుమార్లు బెదిరించాడు. అంతటితో ఆగకుండా స్టేషన్ వద్దకు వచ్చి హంగామా సృష్టించాడు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారిని వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Mahbubnagar, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు