Home /News /telangana /

A PAKISTANI GIRL WHO FELL IN LOVE WITH A BOY FROM HYDERABAD TRIED TO ENTER INDIA ILLEGALLY PRV

Hyderabad boy Pakistan Girl: ప్రేమెంత పనిచేసే.. లవ్​ కోసం పాకిస్తాన్​ నుంచి అమ్మాయిని దింపిన హైదరాబాద్​ కుర్రాడు.. చివరికి..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ అబ్బాయి.  పాకిస్థాన్ (Pakistan) అమ్మాయి. ఆన్​లైన్​లో ప్రేమ. ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదో హాట్​ టాపిక్​గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Hyderabad
    హైదరాబాద్ అబ్బాయి (Hyderabad boy).  పాకిస్థాన్ అమ్మాయి (Pakistan girl) . సోషల్​ మీడియాలో పరిచయమైన వీరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో (love) పడ్డారు. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు దేశ సరిహద్దులు దాటి హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నించిన యువతి పోలీసులు అడ్డంగా దొరికిపోయింది. సినిమా కథను తలపించే ఈ రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు దాయాది దేశాల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురాకు చెందిన అహ్మద్‌ (Ahmad) కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఇతడికి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన ఖాదిజా నూర్‌ సోషల్‌మీడియాలో పరిచయమైంది. చాటింగ్, వాయిస్, వీడియోకాల్స్‌తో ఈ ఆన్‌లైన్‌ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

    Criminal Doctor: ఇతనో రాక్షస వైద్యుడు.. అలా చేస్తే చాలట ఎలాంటి సర్టిఫికెట్​ కావాలన్నా ఇచ్చేస్తాడట..

    హైదరాబాదీతో తన ప్రేమ విషయాన్ని నూర్‌ తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే భారతీయుడికిచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నూర్‌ ద్వారా విషయం తెలుసుకున్న అహ్మద్, ఆమెను పెళ్లి చేసుకోవడానికి అనువైన మార్గాల కోసం అన్వేషించాడు. ముందుగా ఆమెను హైదరాబాద్‌ పంపి, తరువాత తానూ వచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అహ్మద్.



    నకిలీ ఆధార్‌ కార్డు తయారీ..

    సౌదీలో (Saudi) అహ్మద్‌ పని చేస్తున్న హోటల్లోనే కొందరు నేపాలీలు పని చేస్తున్నారు. ఏళ్లుగా కలిసుండటంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. నూర్‌ను తమ దేశం మీదుగా హైదరాబాద్‌ (Hyderabad) పంపుదామంటూ నేపాలీలు అహ్మద్‌కు సలహా ఇచ్చారు. అక్కడ వారికి సహాయం చేయడానికి జీవన్‌ అనే నేపాలీని ఏర్పాటు చేశారు. దీంతో అహ్మద్‌ తన సోదరుడు మహ్మద్‌ను రంగంలోకి దింపాడు. నూర్‌కోసం ఆర్జూ బాగ్దాదియా పేరుతో నకిలీ ఆధార్‌ కార్డు తయారు చేయించాడు. దీన్ని తీసుకుని మహ్మద్‌ గత వారం నేపాల్‌ చేరుకున్నాడు. నూర్‌ దుబాయ్‌ మీదుగా నేపాల్‌ వచ్చింది. నేపాలీ జీవన్‌తోసహా ముగ్గురూ ఇండో–నేపాల్‌ సరిహద్దు బిహార్‌లోని సీతమ్రాహీ జిల్లా బిట్టామోర్‌ బోర్డర్‌ ఔట్‌పోస్టుకు మంగళవారం చేరుకున్నారు.

    తెల్లవారుజామున అక్కడ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తూ ఎస్‌ఎస్‌బీ బలగాల కళ్లల్లో పడ్డారు. నూర్‌ వద్ద హైదరాబాద్‌కు చెందిన మహిళగా ఆధార్‌ కార్డు, పాకిస్తాన్‌ పాస్‌పోర్టు, ఫైసలాబాద్‌లోని జీసీ ఉమెన్‌ యూనివర్సిటీలో సైకాలజీ చదువుతున్నట్లు గుర్తింపుకార్డు, పాక్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు లభించాయి. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. గూఢచర్యం కోసం వస్తుందేమోనని అనుమానించిన పోలీసులు.. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎస్‌ఎస్‌బీ అధికారులు సీతమ్రాహీ పోలీసులకు ముగ్గురినీ అప్పగించారు.

    నిఘా వర్గాలు అప్రమత్తం..

    ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న తెలంగాణ రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్‌ పోలీసులతో కలిసి అహ్మద్, మహ్మద్‌లకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో… ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. నూర్, మహ్మద్, జీవన్‌లను విచారించడానికి ఓ బృందం అక్కడికి బయలుదేరి వెళ్లింది. అలాగే పాతబస్తీలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bihar, Hyderabad, India pakistan, Love

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు