Home /News /telangana /

A NORMAL FARMER BECOME A SCIENTIST IN THE AGIRI SECTOR NZB VRY

Scientist farmer : శాస్త్రవేత్తగా మారిన రైతు.. వందలాది వరి వంగడాలతో ఆర్గానిక్ ఉత్పత్తి...!

farmer become a Scientist

farmer become a Scientist

Scientist farmer : చదివింది ఆరోతరగతి... చేసింది మాత్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా చేయలేని పనికి శ్రీకారం చుట్టాడు.. అందులో విజయం సాధించాడు ఓ రైతు.. ఏకంగా అంతరించిపోతున్న 110 రకాల వరివంగడాలను ఆయన అభివృద్ది చేసి ఆదర్శంగా నిలిచారు..

ఇంకా చదవండి ...
  ( న్యూస్18 తెలుగు ప్ర‌తినిధిః పి మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా,)

  కృషి.. పట్టుదల.. న‌మ్మ‌కం ఉంటే ఏదైనా సాద్య‌మే... అని ఓ రైతు నిరుపించారు.. ఆరోగ్యంగా ఉండాలంటే రసాయనాలతో పండిచిన పంటలు కాకుండా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ పద్దతిలో పండించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలుసుకున్నాడు.. అప్పటి నుంచి తన వ్యవసాయ క్షేత్రంలో ఏలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తు అందరికి ఆదర్శంగా  నిలుస్తున్నారు..  ఎప్పుడో అంతరించి పోయిన 110 రకాల వరి వంగడాలను దేశం మొత్తం తిరిగి సేక‌రించి దేశీ వ‌రి విత్త‌న బ్యాంక్ ను ప్రారంభించి అందరికి అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేయాల‌నే రైతు త‌న వ‌ద్ద‌కు వ‌స్తే విత్త‌న‌లు ఇచ్చి .. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం పై స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తానంటున్న నిజామాబాద్ జిల్లా చిన్నికృష్ణుడిపై ప్ర‌త్యేక క‌థ‌నం...

  నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలూర్ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు  నాగుల చిన్న గంగారం అందరూ చిన్ని కృష్ణుడు గా పిలుస్తుంటారు...  ఆరవ తరగతి వరకు చదువుకున్నారు.. వృత్తి వ్యవసాయ అయినప్పటికీ  ప్రవృత్తి కళాకారుడు..  ఈయన చిన్నతనం నుంచే నాటకాల్లో చిన్నికృష్ణుడిని పాత్ర‌ను  పోషించడంతో అదే పేరుతో అంద‌రికి సుప‌రిచితుడ‌య్యాడు..  ప్రస్తుతం 68 ఏళ్ల వయస్సు కలిగిన చిన్నికృష్ణుడు.. 2007లో  యోగా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయదారులు పాలేకర్ చెప్పిన మాటలు చిన్న గంగారాంను ఆలోచింప జేసాయి..  చిన్నతనంలో కుటుంబ పెద్దలు ఆచరించిన వ్యవసాయ పద్ధతులను గుర్తుచేసుకున్నారు.. ఇప్పుడు పండిస్తున్న పంటలు రసాయ‌నలతో పండించి తినడం వల్ల జబ్బులు తెచ్చుకుంటున్నమని అని గ్రహించారు.. ఆహారోత్పత్తుల పై రాజీవ్ దీక్షిత్ రాసిన పుస్తకాలు చదవడంతో పాటు అధ్యయనం చేశారు.. అంతరించిపోతున్న వరి వంగడాలను దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సేకరించారు..  వాటిని పండిస్తూ ఆచరణలో చేసి చూపారు..

  Guest lecturer Suicide : ఇద్దరు గెస్ట్ లెక్చరర్ల మధ్య అక్రమ సంబంధం.. లేడీ లెక్చరర్ బెదిరింపులు

  ఇక తాను ఆచరించిన విధానాలు తెలిసిన పరిజ్ఞానాన్ని తన వరకే పరిమితం చేసుకోలేదు అనేక మంది రైతులకు తెలియజేస్తూ వారు ఆచరించేలా  చేస్తున్నారు.. ఇప్పటికే తను సేకరించిన వంగడాలు ఎంతో మంది రైతులు సాగుచేస్తున్నారు.. రానున్న రోజుల్లో ఆందరు రసాయాణలు లేని పంటలు పండించాలని ఆయన కోరుతున్నారు..  అయితే 2009 నుంచి  చిన్నబుడుమ, నవారా, మెడిసినల్  రెడ్ రైస్ అనే మూడు రకాల వరి విత్తనాలను సేక‌రించి ...  సేంద్రియ సాగు చేయడం ప్రారంభించారు.. అయితే 2019 నాటికి 110 రకాల వరి విత్తనాలు సాగు చేసారు.. ఆ విత్తనాలను మరింత మంది రైతులు సాగు చేసేలా ప్రోత్సహిస్తూ వస్తున్నారు..తన కృషికి  చిన్నికృష్ణుడు ఉపరాష్ట్రపతి అవార్డుతో పాటు అనేక అవార్డులు సాధించారు..

  Nalgonda : ట్రాన్స్‌జెండర్స్‌తో ఫ్రెండ్‌షిప్.. నమ్మిన వారే నరకం చూపించారు.. తల, మొండెం వేరు చేసి.  తాజాగా నిన్న జరిగిన రైతుల దినోత్సవం సంధర్భంగా  మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు  చిన్ని కృష్ణుడు నిర్వహించనున్న దేశి వరి విత్తన బ్యాంకు ప్రారంభోత్సవాన్ని కలెక్టర్ గురువారం నాడు ప్రారంభించారు. ఈ  సంధర్భంగా చిన్ని కృష్టుడు మాట్లాడుతూ...    భాత‌ర దేశం లో సుమారు 40వేల ర‌కాల వ‌రి వంగ‌డాలు ఉండేవి.. రాను రాను ప‌ది వేల వండ‌గాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని అన్నారు.. కాలంతో పాటు వ్య‌వ‌సాయంలో వ‌చ్చి మార్పులతో హైబ్రిడ్ వంగ‌డాలు వ‌చ్చాయి.. ర‌సాయ‌న ప‌దార్థ‌ల‌ను ఎక్కువ మోత‌దులో వేసి దిగిబ‌డి పెంచారు.. కానీ ఆరోగ్య‌న్ని పాడు చేసుకుంటున్నారు.. 2007లో  ప్ర‌కృతి వ్య‌వ‌సాయం మొద‌లు పెట్టాను.. ఈ రోజు 110 ర‌కాల వ‌రి వంగ‌డాల‌ను అబివృద్ది చేసాన్నారు.. వాటిని అంద‌రికి అందించాల‌నే ల‌క్ష్యంతో దేశీ వ‌రి విత్త‌న బ్యాంక్ ను ప్రారంబించామ‌న్నారు.. ఒక ఎక‌రం ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేయాలంటే 50కేజీల ప‌ల్లి పిండి.. 50 కేసీల వేప పిండి చ‌ల్లితే స‌రిపోతుంది.. ఎక‌రాని 25 బస్తాల దిగుబ‌డి వ‌స్తుంద‌న్నారు.. ఆరోగ్యం కావాలంటే ఆర్గానిక్ వ్య‌వ‌సాయం చేయాల‌ని అన్నారు..   విదేశీ రకాలను ఉపయోగించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు..

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Farmers, Nizamabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు