Home /News /telangana /

A NEW LAW ON SINGLE USE PLASTIC HAS COME INTO FORCE IN TELANGANA FROM TODAY PRV

Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్​.. నేటి నుంచే కొత్త చట్టం అమలు.. ఉల్లంఘిస్తే జరిమానే..

తెలంగాణ మ్యాప్

తెలంగాణ మ్యాప్

తెలంగాణలో మరో కొత్త చట్టం నేటి నుంచే అమల్లోకి రానుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశమూ ఉంది.

    తెలంగాణ (Telangana)లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (Single use Plastic)పై నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నది. అదేవిధంగా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ (Used plastic) వస్తువుల తయారీ, పంపిణీ, నిల్వ, అమ్మకాలు చేసే యూనిట్లు మూసివేయించనుంది ప్రభుత్వం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం కచ్చితంగా ఇతర వ్యాపారాలపై పడే అవకాశం ఉంది.చిన్న టెట్రా ప్యాక్‌లలో విక్రయించే పానీయాల సరఫరా గొలుసు దెబ్బతింటుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో పేపర్ స్ట్రాలను దిగుమతి చేసుకోవడం వల్ల పానీయాల తయారీదారులు భారీ దిగుమతి, లాజిస్టిక్స్ ఖర్చులను భరించవలసి ఉంటుంది.

    కంట్రోల్‌ రూమ్‌లు..

    నిషేధాన్ని ఉల్లంఘిస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం(ఈపీఏ)లోని సెక్షన్‌ 15, సంబంధిత మున్సిపల్‌ కార్పొరేషన్ల నిబంధనల కింద జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ ఉంటాయని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటవుతాయని వారు తెలిపారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌(ఎస్‌యూపీ) వస్తువుల తయారీ, పంపిణీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని ఈ అధికారులు తెలిపారు. రాష్ర్టాల మధ్య ఎస్‌యూపీ వస్తువుల రవాణాను అరికట్టేందుకు సరిహద్దులో చెక్‌పాయింట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ర్టాలు, యూటీలను కోరింది. ఈ నిషేధం అమలులో సహకరించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) పౌరులకు కూడా అవకాశం కల్పించింది. ఓ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ అప్లికేషన్‌ను లాంచ్‌ చేసింది.



    నిషేధిత జాబితాలోని ప్లాస్టిక్‌ వస్తువులు..

    ఇయర్‌బడ్స్‌, బెలూన్లకు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్‌ పుల్లలు (క్యాండీ స్టిక్స్‌), ఐస్‌క్రీమ్‌ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్‌ షీట్లు, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్‌ గ్లాసులు, ఫోరులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్‌ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి రేపర్స్‌, సిగరెట్‌ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు.

    PLA స్ట్రాల కాగితం వంటి పర్యావరణ అనుకూల ఎంపికలకు తయారు చేసేందుకు, ఆల్కహాల్ లేని పానీయాల తయారీదారులకు కనీసం 6-8 నెలల సమయం పడుతుంది. భారతదేశం సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ ప్లాస్టిక్ స్ట్రాల‌తో దాదాపు 6 బిలియన్ ప్యాక్‌ల పేపర్ ఆధారిత పానీయాల కార్టన్‌లను ఉత్పత్తి చేసి విక్రయిస్తోందని పార్లే ఆగ్రో తెలిపింది. స్థానిక భారతీయ తయారీదారు ద్వారా బయోడిగ్రేడబుల్ PLA స్ట్రాల లేదా పేపర్ స్ట్రాల వంటి ప్రత్యామ్నాయాలను అందించడానికి అందుబాటులో ఉన్న సామర్థ్యం రోజుకు 1.3 మిలియన్ యూనిట్లు. ఇది వాస్తవ అవసరాల కంటే చాలా తక్కువ.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Plastic, Plastic Ban, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు