హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cm Kcr: తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం..8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Cm Kcr: తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం..8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల క్లాసులను నేడు సీఎం కేసీఆర్ (Cm Kcr) వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా కేసీఆర్  (Cm Kcr) మాట్లాడుతూ..తెలంగాణలో ఇది సరికొత్త చరిత్ర. దేశానికే తెలంగాణ ఆదర్శం కాబోతుందని కొనియాడారు. ఈ అకాడమిక్ ఇయర్ లో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Governoment Medical Colleges)ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని సీఎం కేసీఆర్  (Cm Kcr) అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతాలకు మెడికల్ కాలేజీ (Governoment Medical Colleges)లు వస్తాయని ఎవరు ఊహించలేదన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల క్లాసులను నేడు సీఎం కేసీఆర్ (Cm Kcr) వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా కేసీఆర్  (Cm Kcr) మాట్లాడుతూ..తెలంగాణలో ఇది సరికొత్త చరిత్ర. దేశానికే తెలంగాణ ఆదర్శం కాబోతుందని కొనియాడారు. ఈ అకాడమిక్ ఇయర్ లో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Governoment Medical Colleges)ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని సీఎం కేసీఆర్  (Cm Kcr) అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతాలకు మెడికల్ కాలేజీ (Governoment Medical Colleges)లు వస్తాయని ఎవరు ఊహించలేదన్నారు. కొత్త మెడికల్ కాలేజీలు (Governoment Medical Colleges) తెచ్చిందుకు మంత్రి హరీష్ రావు (Harish Rao) ఎంతో కృషి చేశారని ఈ సందర్బంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మెడికల్ సీట్లు 2790 పెరిగాయన్నారు. గతంలో సీట్లకు ఇది 4 రేట్లు ఎక్కువని కేసీఆర్  (Cm Kcr) అన్నారు. అలాగే పీజీ సీట్లు కూడా 1180కి పెరిగాయన్న విషయాన్ని కేసీఆర్  (Cm Kcr) గుర్తు చేశారు.

Dalit Bandhu Scheme: దళితుల ఖాతాల్లో 10లక్షలు జమ .. దళితబంధు రెండో విడత నిధులు ఎప్పడు ఇస్తున్నారంటే..?

గతంలో రాష్ట్రంలో 850 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయి.  ప్రస్తుతం మెడికల్ సీట్లు 2790కు పెరిగాయన్నారు. తెలంగాణలో మొత్తం 18 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇంకో 17 జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాలి. త్వరలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఉండేలా చూస్తామని కేసీఆర్ అన్నారు. వైద్యరంగం కోసం ఎంతైనా ఖర్చు పెడతామని, పేదల వైద్యం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తామన్నారు. జనాభాకు నిష్పత్తి ఆధారంగా డాక్టర్లు ఉండాలి. నర్సింగ్ కాలేజీలను కూడా నిర్మిస్తాం అని కేసీఆర్ తెలిపారు. దళిత, బడుగు బలహీన, గిరిజన వర్గాలకు ఇదే మంచి అవకాశం అని అన్నారు. ప్రతీ జిల్లాకు వైద్యం అందేలా వైద్య రంగం అడుగులు వేస్తుందని కేసీఆర్ అన్నారు.

Live: CM Sri KCR commencing academic classes in the newly established 8 Govt. Medical Colleges.#AarogyaTelangana https://t.co/BjITR4j9ar

— Telangana CMO (@TelanganaCMO) November 15, 2022

సంగారెడ్డి , మహబూబాబాద్జగిత్యాల , కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల , నాగర్ కర్నూల్ , రామగుండంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (Medical Colleges) ఏర్పాటు చేశారు. కాగా త్వరలోనే సిరిసిల్ల, ఖమ్మం , వికారాబాద్కామారెడ్డి , కరీంనగర్ , జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, జనగాంలో కూడా మెడికల్ కాలేజీ (Medical Colleges)లు ఏర్పాటు అయ్యాయి. ఇవాళ కేసీఆర్ (Cm Kcr)ప్రారంభించిన మెడికల్ కాలేజీల (Medical Colleges)ను ఆయా జిల్లాల ఆసుపత్రులకు అనుసంధానం చేశారు.

First published:

Tags: CM KCR, Medical colleges, Telangana

ఉత్తమ కథలు