నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం గోగులవారి గూడెం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ఓ కారు కొట్టుకువస్తున్న కారును చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొత్త కారు నీళ్లలో కొట్టుకురావడంతో ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆలోచించారు. ముఖ్యంగా హోలీ రోజు కావడంతో మద్యం మత్తులో ఇలా జరిగి ఉంటుందని భావించారు.
అయితే కారును కావాలనే ఓ జంట తమ వస్తులను కారులో ఉంచి ప్రమాదం జరిగినట్టుగా క్రియెట్ చేశారు. వేముల గూడెం వద్ద కారును నీళ్లలోకి తోస్తుండగా చూసిన స్థానికులు వారిని ప్రశ్నించడంతో అక్కడి నుండి జారుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వారు ఇద్దరు ప్రేమ జంటగా పోలీసులు బావిస్తున్నారు. ఇంట్లోవాళ్లను నమ్మించడం కోసం ఇలా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కారు టీఆర్ నంబర్‌తో ఉంది. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతానికి చెందిన పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. కారును నీళ్లలోకి నెట్టిన జంట ఆచూకి లభిస్తే కాని అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.