Murder : కుటుంబాల మధ్య 20 ఏళ్ల పగ.. తోడుగా వెళ్లిన స్నేహితుడిపై లారీ ఎక్కించి..

కుటుంబాల మధ్య 20 ఏళ్ల పగ..తోడుగా వెళ్లిన స్నేహితుడిపై దారుణం (ప్రతీకాత్మక చిత్రం )

Murder : సినిఫక్కిలో ఓ హత్య జరిగింది. పోలం పనులకు వెళ్లిన వారిని అడ్డగించి, పార్క్ చేసిన కారును లారీతో ఎక్కించి ధ్వంసం చేశారు. కారునే కాకుండా మనుషులను సైతం వెంబడించి లారీతో గుద్దించారు. దీంతో ఓ యువకుడి నిండు ప్రాణం బలితీసుకున్నారు.

  • Share this:
కుటుంబాల మధ్య ఇరవై ఏళ్ల పగకు ఓ స్నేహితుడు బలయ్యాడు. స్నేహితునికి తోడుగా వెళితే..దుండగులు అసలు వ్యక్తిని వదిలి పెట్టి సంబంధం లేని యువకుడిని దారుణంగా హత్య చేశారు. పోలానికి పనికి వెళ్లిన వాళ్లను ప్లాన్ వేసి చంపివేశారు. అది కూడ సిని ఫక్కిలో దాడి చేసి చంపడం చర్చనీయాంశంగా మారింది.

రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండలంలోని మేడిగడ్డ వద్ద ఈ దారుణం జరిగింది. మేడిగడ్డ తండాకు చెందిన రెండు కుటుంబాలు బాల్‌కిషన్ సింగ్,నిరంజన్ సింగ్ అనే రెండు కుటుంబాల మధ్య గత ఇరవై ఏళ్లుగా శత్రుత్వం నడుస్తోంది. ఇద్దరి మధ్య భూతదాలు ఉండడంతో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2004వ సంవత్సరంలో నిరంజన్ సింగ్ తల్లి దండ్రులు ప్రాణాలు సైతం కోల్పోయారు. వీరిని ప్రత్యర్థి వర్గాలు హత్య చేసి చంపాయి.

కగా ఇదే విషయమై గత సంవత్సర కాలంగా వివాదాలు మరింత తీవ్రమయ్యాయి. రెండు కుటుంబాల మధ్య తరచు ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాల్‌కిషన్ కుటుంబం నుండి తమకు ప్రాణ హాని ఉందని కొద్ది రోజుల క్రితమే నిరంజన్ సింగ్ అతని సోదరుడు రాజేశ్ సింగ్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే బుధవారం మేడిగడ్డ గేటు సమీపంలోని నిరంజన్ మరియు రాజేస్ సింగ్ లతో పాటు వారి స్నేహితుడైన సందీప్‌ను తీసుకుని పొలం వద్దకు వెళ్లి వరికోతలు చేయిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న బాల్‌కిషన్ సింగ్ ఆయన సోదరులు లారీలో మేడిగడ్డకు వెళ్లారు. అనంతరం అక్కడ పార్క్ చేసి ఉన్న నిరంజన్ సింగ్ కారును లారీతో ఢికొట్టారు. కారును ధ్వంసం చేసిన అనంతరం అక్కడే ఉన్న కుటుంబ శత్రువులను వదిలి వారి వెంట వచ్చిన సందీప్ అనే స్నేహితుడిపై లారీని ఎక్కించి హత్య చేశారు.

సంఘటన అనంతరం నిరంజన్ సింగ్ సోదరులు పోలీసులకు పిర్యాదు చేశారు. హత్య జరిగిన స్థలానికి స్థానిక సీఐ ఉపేందర్ చేరుకుని వివరాలు సేకరించారు.కాగా హత్యకు కారణమైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Published by:yveerash yveerash
First published: