నిర్లక్ష్యపు డ్రైవింగ్ (Reckless driving) ప్రాణాలే బలి తీసుకుంటుంది. ఏదో చిన్న పనేలే అనుకొని డ్రైవింగ్‌లో ఉండగా రోడ్డు చూడకుండా బండి నడిపేస్తారు కొందరు. ఇక మరికొందరైతే సింగిల్ హ్యాండ్‌తోనే వాహనం నడిపేస్తారు. ఆ సమయంలో ఏదో ఒక వాహనం పక్కనుంచి వెళ్లినా.. ఎదురుగా ఏదైనా అడ్డు వచ్చినా జరగరాని ఘోరం జరిగిపోతుంది. ఓ ప్రాణం కొన్ని కుటుంబాలను కొందరి జీవితాలనే రోడ్డున పడేసే ప్రమాదం (Road accident) ఉంది. తాజాగా ఇలాంటి ఘటన రంగారెడ్డి (Ranga reddy) జిల్లాలోని నార్సింగి అప్పా జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి ఉమ్మి వేసేందుకు (To spit) కారు డోర్ తీయడం (Car door open).. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి కారణమైంది. ఈ ఘటన ఆ మార్గంలో ప్రయాణించేవారిని కలిచివేసింది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంది. కారు రన్నింగ్‌లో ఉండగానే (car in Running) ఉమ్మి వేసేందుకు సైడ్ డోర్ తీశాడు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన బైక్.. కారు డోర్ (car door)ను ఢీకొట్టింది. దీంతో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు.
దూసుకెళ్లిన బస్సు..
అయితే అదే సమయంలో అటుగా వచ్చిన బస్సు.. కిందపడిన వ్యక్తి పై నుంచి దూసుకెళ్లింది. దీంతో ద్విచక్రవాహనదారుడు (Motorist) అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కు (Andhra pradesh) చెందిన మేస్త్రీగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారు యజమాని ఎల్లయ్య (Yellaiah)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మన దేశంలో ఏటా రోడ్లపైకి వస్తున్న కొత్త వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ వాహనాల రద్దీకి తగ్గట్లు మౌలిక సదుపాయాల కల్పన మాత్రం అంతగా ఉండట్లేదు. దీంతో ప్రమాదాలు జరిగి చాలామంది వాహనదారులు చనిపోతున్నారు. దేశంలో యాక్సిడెంట్ కేసుల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ గణాంకాల చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుడిని కాపాడటానికి చేయాల్సిన ప్రయత్నాలు, బాధితులకు వర్తించే పరిహారం, తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
* యాక్సిడెంట్ జరిగినప్పుడు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే బాధ్యత ఎవరిది?
రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనదారుడు లేదా సంబంధిత వాహనం డ్రైవర్ బాధితుడిని కాపాడాలి. ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లి చికిత్స అందించాలి.
ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ లేనివారి పరిస్థితి ఏంటి?
బాధితుడికి ఇన్సూరెన్స్‌తో పనిలేదు. కానీ ప్రమాదానికి కారణమైన కారు యజమానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలి. కారు యజమాని లేదా డ్రైవర్ చట్ట ప్రకారం బాధితుడికి నష్టపరిహారం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెల్లించాల్సి ఉంటుంది.
* వాహనం యజమాని స్నేహితుడు లేదా డ్రైవర్ యాక్సిడెంట్‌కు కారణమైతే..
ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి?ఈ సందర్భంలో డ్రైవింగ్ చేసే వ్యక్తికి మోటార్ వెహికిల్ యాక్ట్, 1988లోని సెక్షన్ 279, 337, 338, IPC సెక్షన్ 304A ప్రకారం శిక్ష విధిస్తారు. దీంతో పాటు వాహన యజమాని చట్ట ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAR, Motorcycle, Ranga reddy, Road accident