Peddapalli : కసాయిగా మారిన తల్లి... అంగవైకల్యం ఉన్న ఆడ కూతురుపై అమానుషం

Peddapalli : కసాయిగా మారిన తల్లి... అంగవైకల్యం ఉన్న ఆడ కూతురుపై అమానుషం

Peddapalli : అంగవైకల్యం ఉన్న అడకూతురుపై ఓ తల్లి ఘోరంగా వ్యవహరించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా..కూతురును పెంచిపోషించాల్సిన తల్లి అమానవీయంగా ప్రవర్తించింది. సొంత కూతురునే కదులుతున్న రైలునుండి కిందకి తోసివేసి కసాయిగా మారింది.

  • Share this:
    ఆర్థిక పరిస్థితులు.. భవిష్యత్‌లో జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలపై దారుణంగా తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేని తల్లిదండ్రులు తమ పిల్లలు సైతం ఇలాంటీ కష్టాలను భరించకూడదనే నిర్ణయానికి వస్తున్నారు. దీంతో తమతోపాటు వారిని కూడా నిర్ధాక్షిణ్యంగా కడతేరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లలు అనికూడా చూడకుండా అంగవైకల్యం ఉన్నారని వారి భవిష్యత్‌ను ఊహించుకోలేని వారు..పిల్లల ప్రాణాలను తీస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి.

    పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచోసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఆరేళ్ల ఆంగవైకల్యం ఉన్న బాలికను ఆమె సొంత తల్లే కడతేర్చాలని నిర్ణయించింది. తన కూతురును పోషించే స్థోమత లేక హైదరాబాద్‌ నుండి బల్లార్ష వెళుతున్న రైలులో కూతురుతో కలిసి ఎక్కింది..అనంతరం పెద్దపల్లిలోని గొల్లపల్లికి రైలు చేరుకోగానే బాలికను తోసేసింది. ..దీంతో ఇది గమనించిన స్థానికులు బాలికను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

    కాగా ఇటివలే అదే జిల్లాలోని మానసిక పరిస్థితి సరిగా లేని తన సొంత కొడుకును కూడా పాడుబడ్డ వ్యవసాయ బావిలో నెట్టివేయడంతో ఆ బాలుడు మృత్యువాత పడ్డారు. ఆర్ధిక ఇబ్బందులు భరించలేకనే బాలున్ని బావిలో తోసినట్టు చెప్పింది. ఇక తండ్రి ఫిర్యాదుతో ఆమె కటకటాలపాలైంది.. అయితే జిల్లాలో కొద్ది రోజుల తేడాతోనే రెండు సంఘటనలు జరగడంతో..కలకలం రేకేత్తుతుంది. అభం శుభం తెలియని అమాయక పిల్లల పట్ల తల్లిదండ్రుల వైఖరి మారుతుండడం వెనక అసలు కారణాలు ఏమై ఉంటాయనే చర్చ మొదలైంది.

    అయితే...ఇలా కన్నతల్లిదండ్రులే ఆర్థిక పరిస్థితులతో తమ వారిని కడతేర్చడంతో తల్లిదండ్రులపై ఉండే అభిప్రాయం మారేందుకు అవకాశాలు ఉన్నాయి..ఇలాంటీ సంఘటనలు పునారవృతం కావడం వల్ల కుటుంబ సంబంధాలపై ప్రభావం పడనుంది..ఆంగవైకల్యం, లేదా మానసిక వైకల్యంతో పుట్టడం పిల్లల తప్పు కాకున్నా... తల్లి దండ్రులు మాత్రం నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటీ వారి పట్ల అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్ పరిణామాలు మరింత కఠినంగా మారే అవకాశాలు ఉన్నట్టు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటీ పిల్లల పరిస్థితులపై ప్రభుత్వాలు దృష్టి మరల్చాల్సిన అవసరం ఏర్పడుతుంది.
    Published by:yveerash yveerash
    First published: