• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • A MOTHER PROTESTING ON ROAD IN VEMULAVADA CLAIMS LIFE THREAT FROM SONS MS KNR

కొడుకుల నుంచి ప్రాణహాని ఉందంటూ.. రోడ్డెక్కిన తల్లి.. వేములవాడలో దారుణం

కొడుకుల నుంచి ప్రాణహాని ఉందంటూ.. రోడ్డెక్కిన తల్లి.. వేములవాడలో దారుణం

ఫ్లకార్డుతో నిరసన...

నవమాసాలు మోసి పెంచిన ఆ తల్లి.. కొడుకులను అల్లారుముద్దుగా పెంచుకుంది. చివరి రోజుల్లో తనకింత గంజి పోస్తారని ఆశించింది. కొడుకులకు ఏ ఉద్యోగాలు రాకుంటే.. తనకున్న ఒప్పంద ఉద్యోగాన్ని కూడా ఇచ్చింది. కానీ ఆ కొడుకులు మాత్రం...!

  • News18
  • Last Updated:
  • Share this:
    నవమాసాలు మోసి పెంచిన ఆ తల్లి.. కొడుకులను అల్లారుముద్దుగా పెంచుకుంది. చివరి రోజుల్లో తనకింత గంజి పోస్తారని ఆశించింది. కొడుకులకు ఏ ఉద్యోగాలు రాకుంటే.. తనకున్న ఒప్పంద ఉద్యోగాన్ని కూడా ఇచ్చింది. కొడుకులు కష్టపడకూడదని ఉద్యోగాన్ని త్యాగం చేసినా వాళ్లు మాత్రం కర్కశంగా వ్యవహరించారు. ఆమెను కన్నెత్తి చూడటం లేదు. ఇంటినుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నించారు. తాము చెప్పినట్టు వినకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. చివరికి ఆమెను రోడ్డుపాలు చేశారు. దీంతో ఆ తల్లి తనకు న్యాయం చేయాలని రోడ్డెక్కి నిరసనకు దిగింది.

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వేములవాడ మున్సిపాలిటీలో గ్రామమైన తిప్పాపూర్ కు చెందిన సుంకపాక నరసవ్వ (60) అనే వృద్ధురాలు చాలాకాలంగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నది. చిన్నతనం నుంచి ఇద్దరు కుమారులను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. కొడుకులకు ఉద్యోగాలు లేవని.. తన ఉద్యోగాన్ని త్యాగం చేసింది. ఒప్పందం ప్రకారం చిన్న కుమారుని భార్యకు (కోడలు) ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి తమకు కూడు గూడు కరువైందని ఆ వృద్ద తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పట్టెడన్నం పెట్టమంటే కన్నతల్లి అని చూడకుండా ప్రతి రోజు కొట్టడం తిట్టడం చేస్తున్నారని ఆ తల్లి ఆవేదన చెందుతున్నది.



    ఉన్నతాధికారులు దీనిపై జోక్యం చేసుకుని తనకు ప్రతి నెలా ఇద్దరు కొడుకుల నుండి రూ. 5,000/- రూపాయలను ఇప్పించాలని ధీనంగా వేడుకుంటున్నది. ఇద్దరు కోడళ్ళు, కొడుకులు సైతం కొట్టి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని.. పలుమార్లు కొట్టారని.. ఒకసారి చేతులు కూడా విరగ్గొట్టారని కన్నీరు మున్నీరుగా విలపించింది.
    తనకు కొడుకులు, కోడళ్ల నుంచి ప్రాణహాని ఉన్నదని.. వెంటనే తనకు రక్షణ కల్పించాలని వేములవాడలో నిరసనకు దిగింది. ఫ్లకార్డు చేతబూని.. రోడ్డుమీద ఒంటరిగా దీక్షకు కూర్చుంది.

    ఇది చూసినవారంతా ఆమె గాధను తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నతల్లి పై కర్కశంగా ప్రవర్తించిన కొడుకులను.. వారి భార్యలను ఏం చేసినా పాపమే లేదని అంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు గానీ, అధికారులు గానీ ఆమెపై కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు