(Sayyad rafi, News18, Mahbubnagar)
ఓ తల్లి ముక్కు పచ్చరాలని చిన్నారులతో సహా చెరువులో మునిగింది. అందులో తల్లితో (Mother) పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతు కాగా పెద్ద కుమార్తె మాత్రం బయటపడి ప్రాణాలు దక్కించుకుంది. మహబూబ్నగర్ (Mahbubnagar)జిల్లా లోని శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపాడు గ్రామానికి చెందిన అద్దాల మహబూబ్ (Mahbub) అదే మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రమాదేవి 35 సంవత్సరా లు 13 ఏళ్ల కిందట వివాహమైంది. ఉపాధి కోసం నాలుగేళ్ల కిందట హైదరాబాద్ (Hyderabad) కు వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తె నవ్య దేవరకద్ర మండల కేంద్రంలోని కస్తూరిబా విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుంది. శనివారం ఉదయం రమాదేవి పెద్దల పండుగకు ఇంటికి వెళుతున్నట్లు చెప్పి 8 ఏళ్ల కవల పిల్లలు (Twins) మేఘన మారుతీలతో హైదరాబాద్ నుంచి దేవరకద్ర కు వచ్చి కస్తూరిబాలో చదువుతున్న పెద్ద కుమార్తె నవ్య వద్దకు వెళ్ళింది. ఆ చిన్నారికి పరీక్ష ఉండడంతో కవలలతో కలిసి విద్యాలయం బయట వేచి చూసింది. పరీక్ష పూర్తయ్యాక నవ్యను తీసుకొని దేవరకద్ర నుంచి మహబూబ్నగర్ పట్టణంలోని తన అన్న ఇంటికి వచ్చింది. తన సోదరుడు ఉండమన్న ఉండకుండా తన ముగ్గురు పిల్లలతో కాకర్ల పహాడ్గు బస్సులో బయలుదేరింది.
గ్రామానికి సమీపంలోనే బస్సు స్టేజ్ వద్ద తన పిల్లతో దిగింది. అప్పటికే చీకటి పడింది. కులాల గుండా ఇంటికి వెళ్దామని పిల్లలను నమ్మించి సమీప నల్లకుంట చెరువు వద్దకు తీసుకెళ్ళింది. తన వెంట తెచ్చుకున్న సంచులు బట్టలు ఇతర సామాగ్రిని గట్టున పెట్టి పెద్ద కుమార్తె వద్దంటున్నా వినకుండా పిల్లలను పట్టుకొని చెరువు (Pond) నీటిలోకి తీసుకెళ్ళింది. దీంతో తల్లి కవలలు నీటిలో మునిగిపోయారు. నవ్య మాత్రం తనకు అందిన చెట్టుకొమ్మను పట్టుకొని కేకలు వేసింది అక్కడ ఎవరూ లేకపోవడంతో చాలాసేపు కేకలు వేస్తూనే ఉంది.
తరువాత కేకలు విన్న కొందరు అక్కడికి వచ్చి నవ్యను రక్షించారు. నవ్య జరిగిన విషయం అంత చెప్పింది. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ నరసింహ నవాబుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ పోలీసులు గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నీట మునిగిన తల్లి ఇద్దరు పిల్లల కోసం గ్రామస్తులు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రమాదేవి పిల్లలతో సహా ఎందుకు ఆత్మహత్యయత్నానికి పాల్పడిందో ఎవరికీ తెలియడం లేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family suicide, Mahbubnagar