హోమ్ /వార్తలు /తెలంగాణ /

School girl pregnant: 8వ తరగతి బాలికను గర్భవతిని చేసిన మైనర్​ బాలుడు.. ఆ తర్వాత ఏమైందంటే..

School girl pregnant: 8వ తరగతి బాలికను గర్భవతిని చేసిన మైనర్​ బాలుడు.. ఆ తర్వాత ఏమైందంటే..

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆకర్షణలో పడి నేటి యువత పెడదారులు పడుతున్నారు. వారిని చూసి మైనర్లు కూడా దారి తప్పుతున్నారు. ప్రేమ పిచ్చిలో పడి ఏం చేస్తున్నారో కూడా తెలియని మైకంలో ఉన్నారు. తాజాగా ఓ మైనర్ బాలికను, మైనర్ బాలుడు గర్భవతిని చేయడం కలకలం రేకెత్తిస్తోంది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    ఆకర్షణలో పడి నేటి యువత పెడదారులు పడుతున్నారు. వారిని చూసి మైనర్లు కూడా దారి తప్పుతున్నారు. ప్రేమ (Love) పిచ్చిలో పడి ఏం చేస్తున్నారో కూడా తెలియని మైకంలో ఉన్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక (Minor girl)ను, మైనర్ బాలుడు గర్భవతిని (Pregnant) చేయడం కలకలం రేకెత్తిస్తోంది. పెళ్లి చేసుకోమంటే నిరాకరించిన ఘటన నారాయణపేట (Narayan peta) జిల్లా కోస్గి మండలంలో జరిగింది. కోస్గి మండలానికి చెందిన 8వ తరగతి చదివే బాలికను పదో తరగతి చదువుతున్న బాలుడు గర్భవతిని చేశాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం బాలిక తన అవ్వ దగ్గర ఉంటూ చదువుకుంటోంది. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ (Hyderabad) లో ఉంటున్నారు.

    బాలిక నారాయణపేటలో ఉండగా తన ఇంటి ఎదురుగా ఉండే బాలునితో ప్రేమలో పడింది. ప్రేమ పేరుతో చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. అంతటితో ఆగలేదు.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం శారీరక సంబంధం వరకూ వెళ్లింది. దీంతో బాలిక గర్భం (School girl pregnant) దాల్చింది. ఇక బాలిక కొద్దిరోజుల కిందటే తల్లిదండ్రులు చూడటానికి హైదరాబాద్​ వెళ్లింది. అయితే బాలిక ప్రవర్తనలో తేడాలు చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. మరోవైపు బాలిక శరీరం చూడగా అనుమానం బలపడింది. తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

    హైదరాబాద్​ నుంచి గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు బాలికను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఊరి పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. బాలుడి తరపునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలిక ఏడు నెలల గర్భవతని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

    కొన్నిరోజుల కిందట తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. 12 ఏళ్ల బాలుడు..17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పలితంగా బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ 12 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం తంజావూరు ఆల్-మహిళా పోలీసు దళం 12 ఏళ్ల బాలుడిని లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012 (POSCO Act) కింద ఆ బాలుడిని అరెస్టు చేసింది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ పాఠశాల మానేసిన విద్యార్థులు, ఒకే పరిసరాల్లో నివసిస్తున్నారు. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఏప్రిల్ 16న రాజా మిరాసుదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించగా ఆమె తొమ్మిది నెలల గర్భవతి అని గుర్తించారు. అదే రోజు ఆ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి సమాచారం మేరకు మహిళా పోలీసులు బాలికతో విచారణ చేపట్టారు. ఆమె ఇచ్చిన వివరాల మేరకు 12 ఏళ్ల బాలుడిపై పోక్సో చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

    అనంతం బాలుడిని తంజావూరులోని జువైనల్ హోంకు తరలించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవిమతి మాట్లాడుతూ... బాలిక మరియు ఆమె తల్లిదండ్రులు బాలిక బిడ్డను ప్రసవించే వరకు ఆమె గర్భం గురించి తెలియకుండానే ఉన్నారని తెలిపారు. శాస్త్రీయ పద్ధతులు మరియు DNA పరీక్షను ఉపయోగించి బాలుడి వయస్సును నిర్ధారించాలని మేము నిర్ణయించుకున్నాము అని ఆమె తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బాలుడిని అరెస్టు చేసినప్పటికీ, మరెవ్వరి ప్రమేయం ఏమైనా ఉందా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hyderabad, Minor girl pregnant, Narayanpet, School girl

    ఉత్తమ కథలు