NO Net work : చదువు కోసం ఏకంగా శ్మశానాన్నే అడ్డా చేసుకున్న వైద్య విద్యార్థిని..

NO Net work

NO Net work : ఆన్‌లైన్ క్లాసుల కోసం సరైన నెట్‌వర్క్‌ లేక ఓ వైద్య విద్యార్థిని ఏకంగా శ్మశానంలోనే తన చదువులను కొనసాగిస్తుంది. ఇలా రెండు సంవత్సరాలుగా ఇదే విధంగా ఆన్‌లైన్ క్లాస్‌లను కొనసాంచేందుకు శ్మశానాన్నే కాలేజిగా మార్చుకుంది.

  • Share this:
    కరోనాతో (Coronavirus) విద్యార్థులు చదువులు మొత్తం ఆన్‌లైన్ క్లాసుల  (Online Classes) మయం అయ్యాయి.. ఎక్కడ నెట్‌వర్క్ ఉంటే అక్కడే చదువులు అన్నట్టు చదువులు కొనసాగుతున్నాయి. అయితే ఆన్‌లైన్ చదువులు పట్టణ ప్రాంత విద్యార్థులకు అయితే బాగానే వర్కౌట్ అవుతున్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చుక్కలు చూపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్‌వర్క్ లేక.. కొండలు, గుట్టల ప్రాంతాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో కూర్చోని చాలా మంది విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు.. అయితే ఈ ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం తన ఊళ్లో నెట్‌వర్క్ లేక ఏకంగా శ్మాశానంలో ఫుల్ నెట్‌వర్క్ ఉంటుండడంతో అక్కడికి వెళ్లి ఓ వైద్య విద్యార్థిని చదువుకుంటుంది.

    వివరాల్లోికి వెళితే  జగిత్యాల జిల్లా (Jagtial District) మల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన. ఆమె ఎంసెట్ లో 698 ర్యాంకు సాధించి 2017లో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతోంది. ఊరిలో మొబైల్ సిగ్నల్స్ సమస్య ఉండటంతో.. ఇంట్లో ఉంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ అందడం లేదు. మేడ మీదికి వెళ్లి ఆన్‌లైన్ క్లాసులు విందామంటే.. కోతులు ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి చేస్తాయనే భయం. దీంతో ఆమె ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు సిగ్నల్స్ సరిపడా ఉన్న శ్మశాన వాటికనే వేదికగా చేసుకుంది.

    గతేడాది నుంచి కుటుంబసభ్యుల సహకారంతో నిత్యం శ్మశానవాటికలోనే ఆన్‌లైన్ పాఠాలు వింటున్నానని తన గోడు వెళ్ళబోసుకుంది. నాలాంటి వారికోసం గ్రామంలో సరిపడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అని కల్పన కోరుతుంది. మరోవైపు సెప్టెంబర్ 1 నుంచి కేజీ టూ పీజీ వరకు తరగతులు ప్రారభం అవుతాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

    ఇలా నెట్‌వర్క్ లేక వేలాది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నెట్‌వర్క్ సమస్య ఓవైపు అసలు క్లాస్‌లే జరగని పరిస్థితి మరోవైపు గత కొద్ది రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నారు, అయితే  ఎట్టకేలకు కరోనా సెకండ్ వేవ్ తగ్గుతుండడంతో సెప్టెంబ్ ఒకటవ తేదీ నుండి అన్ని రకాల విద్యావ్యవస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థుల కష్టాలు గట్టెక్కనున్నాయి.
    Published by:yveerash yveerash
    First published: