• Home
 • »
 • News
 • »
 • telangana
 • »
 • A MASSIVE THEFT TOOK PLACE IN HYDERABAD VALUABLE DIAMONDS AND GEMS WERE STOLEN BY THIEVES VB

Hyderabad Massive Theft: హైదరాబాద్‌లో భారీ చోరీ.. జాతి రత్నాలు, వజ్రాలు చోరీ.. వాటి విలువ ఎంతో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Massive Theft: నాగోల్‌ డివిజన్‌ మధురానగర్‌లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన వజ్రాలను, జాతిరత్నాలను దొంగలు అపహరించారని శుక్రవారం బాధితుడు ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగర శివారులో దొంగల బెడద ఎక్కువైంది. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. ముందస్తుగా ప్లాన్ చేసుకొని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటిని టార్గెట్ పెట్టుకొని చుట్టుపక్కల ఇళ్లల్లో నివాసం ఉండే వారి కదలికల గమనించి పకడ్బందీగా చోరీలకు రంగంలోకి దిగుతారు. ఇలా హైదరాబాద్ నగర శివార్లలో భారీ చోరీ జరిగింది. మధురానగర్‌కు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి నగరంలో 3 చోట్ల వజ్రాలు, జాతిరత్నాల విక్రయ దుకాణాలు నిర్వహిస్తున్నాడు. ఇంట్లో 40 లక్షల విలువైన వజ్రాలు, జాతి రత్నాలను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10 తేదీన మురళి రూ.1 కోటి 50 లక్షల విలువైన వజ్రాలు, జాతి రత్నాలను ఆయన ఇంట్లో పెట్టాడు. ఆ తర్వాత వీటిలో కొన్నింటిని తాను నిర్వహిస్తున్న షాపుకు తీసుకెళ్లాడు. రూ.40 లక్షల విలువైన వజ్రాలు, జాతి రత్నాలను ఇంట్లోనే ఉంచారు.

  ఈ నెల 15 న మురళి ఇంట్లో లేని సమయంలో దొంగలు పడి ఇంట్లో పెట్టిన వజ్రాలు, జాతిరత్నాలు ఎత్తుకెళ్లారు. మురళి షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడివున్నాయి. వజ్రాలు, జాతిరత్నాలు కనిపించలేదు. దీంతో ఆయన ఎల్బీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్‌ టీం అన్ని ఆధారాలు సేకరించి ఈ నెల 15న చోరీ జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
  మరో ఘటనలో..
  ఎల్బీ నగర్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. రూ. 32 లక్షల విలువైన 94 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసులో యూపీకి చెందిన భరత్ భూషణ్ భన్సల్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మత్తు ప్రతాప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై వివిధ రాష్ట్రాల్లో 60కి పైగా కేసులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు.
  Published by:Veera Babu
  First published: