A MARRIED WOMAN WITH HER CHILD COMMITS SUICIDE BY JUMPING INTO A POND AT NIZAMABAD SRD
Telangana : భర్త వేధింపులు.. చెరువులో దూకి తల్లి బిడ్డల ఆత్మహత్య.. మిగిలిన ఇద్దరు బిడ్డలు..
చెరువులో దూకి తల్లి బిడ్డల ఆత్మహత్య
Telangana : భార్య, భర్తల బంధం అంటే ఒకరికి ఒకరు బ్రతికున్నంత కాలం, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం. కానీ నేటి సమాజంలో ఈ మాట చెప్పుకోవడానికే కానీ, ఆచరించడానికి పనికి రావడం లేదు. అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు చీటికి మాటికి గొడవలు పడి ప్రాణాలు తీసుకుంటున్న
భార్య, భర్తల బంధం అంటే ఒకరికి ఒకరు బ్రతికున్నంత కాలం, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం. కానీ నేటి సమాజంలో ఈ మాట చెప్పుకోవడానికే కానీ, ఆచరించడానికి పనికి రావడం లేదు. అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు చీటికి మాటికి గొడవలు పడి ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు మనం ఎన్నో చూశాం. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో జరిగింది. భర్త వేధింపులు తాళలేక ఆ ఇల్లాలు చావే శరణ్యమని తలచింది. అల్లారుముద్దగా పెంచిన కన్నకూతురితో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారకర ఘటన మోపల్ మండలం కులస్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పూర్ణేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామానికి చెందిన జెనిగెల రమేష్, అనురాధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెళ్లైన దగ్గర నుంచి రమేశ్, అనురాధ దంపతులు అన్యోన్యంగానే ఉంటున్నారు. కానీ, ఏమైందో తెలియదు..భర్త రమేష్ గత కొంత కాలంగా భార్య అనురాధను వేధిస్తున్నాడు. దీంతో అనురాధ తన కూతుళ్లైన అక్షయ, నవ్యశ్రీ, వైష్ణవి లతో కలిసి శుక్రవారం ఉదయం కంజర్ కులాస్పూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువులో దూకడానికి వెళ్లింది.
ఈ నేపథ్యంలో చిన్న కూతురైన నవ్వే శ్రీ (08) ముందుగా చెరువులో తోసేసి తర్వాత తల్లి అనురాధ (38) చెరువులో దూకింది. అయితే మిగతా ఇద్దరు కూతుళ్లు భయా బ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకాడారు. భయంతో ఇంటికి తిరిగి వచ్చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్ద చెరువులో గజ ఈతగాళ్లతో శవాలను వెతికించారు. అనురాధ, చిన్న కూతురు వైష్ణవి ఇద్దరి మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. శవ పంచనామా కోసం మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.