Home /News /telangana /

A MAN WHO ADDICTED TO ALCOHOL DEATH IN CAR FOR NOT OPEN THE DOOR VRY

Hyderabad : కారులోనే పీకల దాకా తాగాడు... డోరు తీయలేక.. అందులోనే...!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన స్వంత కారులో మద్యం సేవించి చివరకు ఆ కారు డోరు తీసే శక్తి లేక అందులోనే సొమ్మసిల్లిపడిపోయాడు. ఆ తర్వాత బయటకు తీసినా ఫలితం లేకుండా పోయింది.

    మద్యానికి బానిసైన వారు తాము ఏం చేస్తున్నామో గమనించలేని స్థాయిలో దిగజారిపోతారు.. నిత్యం మద్యం మత్తులోమునిగి చివరకు తమ ప్రాణాలనే ఫణంగా పెడతారు. తాగిన సయమంలో కనీస శక్తి లేక అక్కడ కుప్పకూలిపోయిన వారు ఎందరో ఉన్నారు.. అయితే పడుతూ లేస్తూ మద్యం సేవించడం మాత్రం వదలలేని స్థితిలోకి నెట్టవేయబడతారు..

    ఇలా హైదరాబాద్ నగరంలోని బోయిగూడకు చెందిన ప్రశాంత్ గత రాత్రి తన ఇంట్లో ఉన్న కారులోనే ఫుల్‌గా మద్యం సేవించాడు.. ఇలా తనివి తాగిన తర్వాత కారులో నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశాడు. కాని కారు డోరు తీయలేని నిస్సహాయస్థితి చేరుకున్నాడు. ఎంతకి డోరు లాక్ తెరుచుకోకపోవడంతో అందులోనే సృహకోల్పోయి పడిపోయాడు... అయితే మద్యం తాగేందుకు వెళ్లిన భర్త ఎంతకు రాకపోవడంతో కారు వద్దకు వెళ్లి డోరు తీసేందుకు ప్రయత్నాలు చేసింది. డోరు తెరుచుకోకపోవడంతో తన ఇంట్లోని మరో తాళం చెవితో కారు డోరు ఓపెన్ చేయించింది. అయితే అప్పటికే కారులో సృహతప్పి పోయిన ప్రశాంత్‌ను తన తమ్ముడి సహాయంతో ఓ ఆసుపత్రికి తరలించింది. కాని పరిస్థితి విషమంగా ఉండడంతో తిరిగి గాంధీకి రిఫర్ చేశారు.. అక్కడి నుండి గాంధీకి తీసుకుని వచ్చారు.. ప్రశాంత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు.

    Nalgonada : ముందుగా ప్రభుత్వ ఉద్యోగి.. ఆ తర్వాత 6గురు స్నేహితులు.. యువతిపై లైంగిక దాడి. ఫలితంగా..!

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Death, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు