Coronavirus:రైల్వే ట్రాకే అతని రహదారి.. తిండి లేకుండా 115 కిలోమీటర్ల నడక

కరీంనగర్ జిల్లా కుచెందిన ఓ వ్యక్తి వరంగల్ నుంచి మంచిర్యాల వరకు రైల్వే ట్రాక్ వెంట రెండు రోజులుగా తిండి లేకుండా నడుచుకుంటూ వచ్చాడు.

news18-telugu
Updated: March 27, 2020, 4:52 PM IST
Coronavirus:రైల్వే ట్రాకే అతని రహదారి.. తిండి లేకుండా 115 కిలోమీటర్ల నడక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల కొంతమంది పడరాని పాట్లు పడుతున్నారు. తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఒకట్రెండు కాదు.. వందల కిలోమీటర్ల కొద్ది కాలినడకనే ప్రయాణిస్తున్నారు. మొన్న ఓ వ్యక్తి మహారాష్ట్రలో 135 కిలోమీటర్లు నడిచిన ఘటన మరువకముందే అలాంటిదే మరోటి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా 115 కిలోమీటర్లు తిండి తిప్పల్లేకుండా నడిచిన ఊదంతం వెలుగులోకి వచ్చింది.

కరీంనగర్ జిల్లా కుచెందిన ఓ వ్యక్తి వరంగల్ నుంచి మంచిర్యాల వరకు నడుచుకుంటూ వచ్చాడు. అదీ ఏ రోడ్డు వెంటో కాదు. రైల్వే ట్రాక్ వెంబడి. చదునుగా ఉన్న రోడ్డు మార్గంపైనే కిలోమీటరు నడిస్తే.. అడుగు తీసి అడుగు వేయడానికి అష్టకష్టాలు పడతాం. అలాంటి కంకర పోసిన రైల్వే ట్రాక్‌ను పట్టుకుని వరంగల్ నుంచి మంచిర్యాల వరకు ఏలాంటి ఆహారం తినకుండా వచ్చాడు. రాత్రి సమయంలో ట్రాక్ పక్కనే పడుకుంటూ రెండు రోజులుగా తినేందుకు ఏమి దొరక్కపోవడంతో కాళ్లకు పనిచెప్పి ప్రయాణించాడు. ఎట్టకేలకు మంచిర్యాల వరకు రైల్వే ట్రాక్‌పై నడుస్తూ చేరుకున్నాడు.
First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading