Telangana : కామారెడ్డి జిల్లాలో విషాదం.. భార్య ఆ పని చేసిందని భర్త ఆత్మహత్య..

ప్రతీకాత్మక చిత్రం

Telangana : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతని ఆత్మహత్యకు కారణమేంటంటే..

 • Share this:
  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే..పోసాని పేట గ్రామానికి చెందిన మంగలపల్లి లక్ష్మణ్ గురువారం రోజు ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు.. భార్య చేసిన పనికే లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ భార్య ఇటీవల బీర్షబా సంస్థలో 3 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. ఆ సంస్థ కొద్దిరోజుల క్రితం మూసివేయడంతో అప్పులపాలైన విషయం లక్ష్మణ్ కి తెలిసింది. అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. డబ్బులు తిరిగి వస్తాయా లేవా అన్న ఆందోళన మొదలైంది. ఇదిలా వుంటే, భార్య పిల్లలతో కలిసి కామారెడ్డిలో నివాసముంటున్న లక్ష్మణ్ గురువారం ఇంటికి వెళ్లివస్తానని పోసానిపేట వెళ్లాడు. అదేరోజు తాను చనిపోతున్నానని భార్యకు వీడియో కాల్ చేసి లైవ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకొని.. తన చావుకు కారణాలను చెప్పాడు.

  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త మరణం తర్వాత బీర్షబా గ్రూపులో భార్య పెట్టిన వాయిస్ రికార్డ్ ఇప్పుడు వైరల్ గా మారింది. మృతుడు లక్ష్మణ్ విద్యుత్ వైరింగ్ పని చేస్తున్నాడు. భార్య జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చావుకు ముందు మృతుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే బీర్షబా సంస్థ గురించి కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు ఆ సంస్థలో ఇంకా ఎంతమంది పెట్టుబడులు పెట్టారు..ఇంకా ఎంత మంది ఆ సంస్థలో మోసపోయారన్న విషయాల్ని కూపీ లాగుతున్నారు పోలీసులు.

  మరోవైపు చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లే వారిని దారుణంగా హత్య చేసింది. జాతీయ బాలికా దినోత్సవం రోజునే తన ఇద్దరు కూతుళ్లను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ హత్య చేసిన సమయంలో కన్న తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలోని అంకిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విద్యాధికులైన తల్లిదండ్రులే మూఢ నమ్మకంతో ఇలా చేయడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు.ఇద్దరు కూతుళ్లను పాశవికంగా హత్య చేసిన అనంతరం వారు పూనకంతో ఉగిపోయారు. పుణ్యలోకాలకు వెళ్లిన ఇద్దరు కూతుళ్లు తిరిగి వచ్చేస్తారంటూ కేకలు వేశారు. అయితే ఈ విషయం పురుషోత్తం నాయుడు స్నేహితుడికి తెలియడంతో అతడు పోలీసులకు సమాచారం అందజేశాడు. దీంతో మదనపల్లె రూరల్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: