Flute With Nose: ముక్కుతో ఫ్లూట్ వాయిస్తున్న కురుమన్న...

కురమన్న..

జింక ముందు ఊదినా.. సింహం ముందు ఊదినా.. ఫ్లూటు నోటితోనే ఊదాలి. ప్రపంచంలో అందరూ నోటితోనే ఫ్లూట్ వాయిస్తుంటారు. అది సాధారణమే.. కానీ మహబూబ్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి మాత్రం నోటితో కాదు.. నేను ముక్కుతో ఫ్లూటు వాయిస్తా అంటున్నాడు.

  • News18
  • Last Updated :
  • Share this:
    జింక ముందు ఊదినా.. సింహం ముందు ఊదినా.. ఫ్లూటు నోటితోనే ఊదాలి. ప్రపంచంలో అందరూ నోటితోనే ఫ్లూట్ వాయిస్తుంటారు. అది సాధారణమే.. కానీ వనపర్తి జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్) కు చెందిన ఒక వ్యక్తి మాత్రం నోటితో కాదు.. నేను ముక్కుతో ఫ్లూటు వాయిస్తా అంటున్నాడు. అనడమే కాదు.. వాయించి చూపించాడు కూడా. కూటి కోసం కూటి తిప్పలన్నట్టు... ఏదో సరదాకు నేర్చుకున్న విద్యే నేడు ఆయనకు కడుపు నింపుతున్నది. అలనాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు పిల్లనగ్రోవి వాయించి.. ఆబాల గోపాలాన్ని  అందించినట్టు.. ఈ నాడు కురమన్న కూడా మనసుకు హాయిగొలిపే విధంగా ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఈ మట్టిలో మాణిక్యం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    తెలంగాణ లోని వనపర్తి జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) ఆత్మకూర్ మండలం పరిధిలో మూలమల్ల గ్రామానికి చెందిన కురుమన్న తన కుటుంబ పోషణ నిమిత్తం.. దినసరి కూలీ చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు. తనకు నలుగురు సంతానం. కురుమన్న కూలి పని చేస్తేనే గాని కాలం గడవదు. అందుకే 30 ఏళ్లుగా పశువుల కాపరిగా పని చేస్తున్నాడు కురమన్న.

    అయితే ఫ్లూట్ వాయించడంలో నిష్ణాతుడైన కురమన్న.. పశువులను మేపే సమయంలో ఖాళీ సమయంలో జాతరలు కొన్న ఫ్లూట్ బయటకు తీస్తాడు. తనను సేద తీర్చుకోవడానికన్నట్టు.. దానిని వాయించుతూ స్వాంతన పొందుతాడు. ఫ్లూట్ వాయించడమే గాక.. ఆయన పాటలు కూడా పాడతారు. గతంలో ఆయన జానపద గేయాలు పాడుతూ ఉండేవాడు.

    చిన్నప్పుడు సరదా కొద్దీ నేర్చుకున్న విద్య ఇప్పుడు నిష్ణాతుడిని చేసింది. అదే కూడు కూడా పెడుతున్నది. ఈ వింత ఫ్లూట్ వాయిస్తున్న కురుమన్న కొన్ని కార్యక్రమాల్లో స్పెషల్ గా గ్రామంలో గ్రామస్తులు పిలిచి ముక్కుతో ఫ్లూట్ వాయించి వింటూ ఉంటారు. స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. ఏ కార్యక్రమం జరిగినా ఆయనను పిలిచి కార్యక్రమం పెట్టించుకుంటుంటారు అక్కడి ప్రజలు. వెలికి తీయాలే గానీ గుండెల నిండా గాయాలు నింపుకున్న పాలమూరు జిల్లాలో ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో ఉన్నాయి. సరైన ఆదరణ, ఆదరువు లేక ఆ మాణిక్యాలు మట్టిలోనే మగ్గుతుండటం బాధాకరమంటున్నారు కళాభిమానులు.
    Published by:Srinivas Munigala
    First published: