హోమ్ /వార్తలు /తెలంగాణ /

Murder : పెళ్లింట విషాదం... పెళ్లి కోసం వచ్చిన మేనమామపై గొడ్డలితో దాడి చేసి చంపిన తండ్రి...

Murder : పెళ్లింట విషాదం... పెళ్లి కోసం వచ్చిన మేనమామపై గొడ్డలితో దాడి చేసి చంపిన తండ్రి...

హత్యకు గురైన శంకర్

హత్యకు గురైన శంకర్

Murder : తెల్లారితే వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది . ( murder ) బావమరిదిపై బావ గొడ్డలితో దాడి చేసి , ప్రాణాలు తీశాడు . ఈ దారుణ ఘటన జగిత్యాల (Jagityal ) మండలం అంబారిపేటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది .

పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. పొలాస గ్రామానికి చెందిన పౌలస్తేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ వీర్ల శంకర్ ( 48 ) .. ఆయన చెల్లెలు జమునను అంబారిపేట వాసి ఆది వెంకటేష్‌కు ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం ( Marrige ) చేశారు . వారికి ఇద్దరు కుమార్తెలు ప్రవళిక , పూజిత . అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వెంకటేష్ మరో వివాహం చేసుకుని గ్రామంలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు . దీంతో వెంకటేశ్ మొదటి భార్య జమున మూడున్నర ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. అయితే తన అక్క పేరుమీద ఉన్న కొంత భూమిని ఆమె తమ్ముడు వెంకటేష్ బావమరిది అయిన వీర్ల శంకర్ అమ్మాడు. అమ్మిన డబ్బులతోనే వెంకటేష్ పెద్ద కుమార్తె పెళ్లి జరపాలని నిర్ణయించారు .

దీంతో తాను సంపాదించిన భూమిని అమ్మి బిడ్డ పెళ్లి చేస్తున్నాడన్న కోపంతో పాటు తన అక్క కోసం పోరాటం చేసి ఆమె పేరు మీద భూమి రాయించుకోవడంతో అప్పటి నుండే వెంకటేశ్ తన బావమరిదిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే జమునా ,వెంకటేశ్‌ల పెద్ద కూతురు వివాహం గురువారం జరగాల్సి ఉంది . కాగా ఈ పెళ్లికి అమ్మాయి మేనమామ అయిన ఈర్ల శంకర్ సైతం హజరయ్యాడు. పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇందులో భాగంగానే పెళ్లి పందిరికి అవసరమైన దుంపిడి గుంజను కొట్టి తెస్తుండగా వెంకటేష్ వచ్చి శంకర్‌తో గొడవకు దిగాడు .

Peddapally : విషాదం..కడుపులో ఓ బిడ్డ, పక్కన మరో బిడ్డతో కలిసి ఏం చేసిందంటే..

ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలోనే వెంకటేశ్ గొడ్డలితో ( Axe ) దాడి శంకర్ పై దాడి జరిపాడు. దాడి నేపథ్యంలోనే శంకర్ మరో సోదరితో పాటు అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికుడిపై కూడా వెంకటేశ్ దాడి చేశాడు. కాగా ఈ దాడిలో శంకర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పాయాడు. శంకర్ సోదరీతోపాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక ముగ్గురిపై దాడి చేసి ఒకరిని హత్య చేసిన వెంకటేశ్ అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వెంకటేశ్ పై కేసు నమోదు చేశారు.

First published:

Tags: Jagityala, Murder

ఉత్తమ కథలు