Death : ప్రాణం పోయినా.. 24 గంటలు కూర్చునే ఉన్నాడు...!

ప్రాణం పోయినా..24 గంటలు కూర్చునే ఉన్నాడు...!

Death : మనిషి బతికినంత కాలం ప్రాణాలు పోయో సమయానికి ఎలాంటీ ఆనారోగ్య సమస్యలు లేకుండా వెళ్లిపోవాలని చాలా మంది కోరుకుంటారు..ఇలాంటీ ఓ వ్యక్తి కోరుకున్నాడో ఏమో..హ్యాపీగా మందు తాగుతూ ..కూర్చున్న చోటే ప్రాణాలు కోల్పోయాడు..

  • Share this:
మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరు చెప్పలేం..ఆరోగ్యంగా ఉన్నా..మన కళ్లముందే తిరుగుతూ..హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతారు..ఇలాంటీ సంఘటనలు కోకల్లలుగా ఉంటాయి..అయితే మరి కొద్ది ప్రాణాలు మాత్రం తాము ఉహించలేని విధంగా గాల్లో కలిసిపోతాయి..ఇలా ఓ వ్యక్తి ప్రాణాలు అలా గాల్లో కలిసిపోయాయి..సంతోషంగా మద్యం సేవిస్తూ..ఉండగానే హర్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ప్రాణాలు వదిలాడు.. తాను తినే తిండిపై చేయి అలాగే.. ఉంది పక్కన ఉన్న మందు గ్లాస్ అక్కడే ఉంది... అంతే.. అలా ప్రాణాలు వదిలాడా.. ఇక ప్రాణాలు వదిలిన 24 గంటలపాటు కూర్చునే ఉండిపోయాడు.

వివరాల్లోకి వెళితే...సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం దండుపల్లికి చెందిన కాసాల సాయిలు(46) మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పాలట గ్రామంలో బంధువు అంత్యక్రియలకు గురువారం మధ్యాహ్నం హాజరయ్యాడు. అదే రోజు తూప్రాన్‌ మీదుగా స్వగ్రామానికి బయలుదేరి, తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌ వద్ద మద్యం తాగేందుకు ఆగాడు. మద్యం, ఆహారం తెచ్చుకొని తూప్రాన్‌-గజ్వేల్‌ రహదారి పక్కన కొద్ది దూరంలో కూర్చుని.. తినడానికి చేతిని ఆహారంలో పెట్టి గుండెపోటుతో అలానే చనిపోయాడు.

సాయిలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు వెతకగా సాయిలు మృతదేహం కనిపించింది. వ్యవసాయం చేసుకునే సాయిలుకు పిల్లలు లేరు. ఈ ఘటనపై తూప్రాన్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకుడు అమర్‌సింగ్‌ను అడగగా.. సైలెంట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ వల్ల గుండెపోటు వచ్చి ఉంటుందని.. దీంతో నొప్పి, ఆనవాళ్లు తెలియకుండా ప్రాణాలు పోతాయని వివరించారు.
Published by:yveerash yveerash
First published: