Home /News /telangana /

A MAN FROM NALGONDA HAD 206 STONES IN HIS KIDNEYS AND DOCTORS OPERATED AND REMOVED THEM FULL DETAILS HERE PRV

Stones in Kidneys: ఒకటి కాదు రెండు కాదు.. ఆయన కిడ్నీలో ఏకంగా 206 రాళ్లు.. వైద్య పరీక్షల్లో వెల్లడి.. ఆయన ఎవరంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కిడ్నీలో రాళ్లు కేవలం నీరు తాగాకా పోవడమే కాకుండా వంశపారంపర్యంగా కూడా సంక్రమించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఇపుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే..  నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి  కిడ్నీలో ఏకంగా 200కు పైగా రాళ్లు ఉన్నాయట.

ఇంకా చదవండి ...
    ఎండాకాలం ఎంత ఎక్కువగా నీళ్లు (water) తాగితే అంత మంచిది. చర్మ సమస్యలే కాదు మూత్రపిండ సమస్యలు కూడా వాటర్​ తగ్గిస్తుంది. ఇక మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే సరిపడా నీళ్లు తాగకపోవడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు కేవలం నీరు తాగాకా పోవడమే కాకుండా వంశపారంపర్యంగా కూడా సంక్రమించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఇపుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే..  నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి  కిడ్నీలో ఏకంగా 200కు పైగా రాళ్లు (Stones) ఉన్నాయట. అయితే కిడ్నీలోని దాదాపు 206 రాళ్లను  (kidney stones)  హైదరాబాద్‌లోని అవేర్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు (Aware Gleneagles Global Hospital ) వెలికితీశారు.  ఆస్పత్రి వైద్యులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

    నల్గొండకు (Nalgonda) చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య (56) (Veeramalla Rama lakshmaiah) గత ఆరు నెలలుగా కిడ్నీలో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆయన గత నెల హైదరాబాద్ (Hyderabad) ఎల్‌బీనగర్‌లోని అవేర్‌ ఆస్పత్రిలో చేరాడు. అతన్ని సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పూల నవీన్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. ఈ పరీక్షల్లో రామలక్ష్మయ్య ఎడమ వైపు కిడ్నీలో చాలా రాళ్లు ఉన్నట్లు తేలింది. అనంతరం సీటీ క‌బ్ స్కాన్ చేసి దీన్ని మ‌రోసారి ధ్రువీక‌రించుకొన్నారు.

    డీ హైడ్రేషన్‌ సమస్య..

    పరీక్షల తర్వాత శస్త్రచికిత్స చేసి రాళ్లను తొలగించాలని నిర్ణయించారు. దీనికి రామలక్ష్మయ్య అంగీకరించారు. దీనిలో భాగంగా రామలక్ష్మయ్యకు కీ హోల్‌ శస్త్ర చికిత్స చేసి గంట వ్యవధిలోనే కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించారు. అనంతరం రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు. వేసవిలో డీహైడ్రేషన్‌ సమస్య (Dehydration‌ problem) అధికంగా ఉంటుందని, ఎండలో అధికంగా తిరగడం కారణంగా రాళ్లు ఏర్పడతాయన్నారు. నీరు, పండ్ల రసాలు అధికంగా తీసుకోవాలని వైద్యులు ప్రజలకు సూచించారు. నీటి శాతం తక్కువ అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని డాక్టర్లు పేర్కొన్నారు. ఎండలో అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని.. శీతల పానీయాల జోలికి పొవద్దని సూచించారు.

    చాలా ఎక్కువగా నీరు తాగాలి..

    ఈ వేసవి కాలం లో చాలా మంది కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో తెగ బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా వున్నా కానీ పలు రకాల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వేధిస్తూనే ఉంటాయి.ముఖ్యంగా వేసవి కాలం లో కిడ్నీల సమస్యతో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్య నుండి బయటపడాలంటే చాలా ఎక్కువగా నీరు తాగాలి. కేవలం కిడ్నీల ఆరోగ్యం మాత్రమే దెబ్బతినకుండా చేయడమే కాకుండా అనేక రకాల సమస్యలను కూడా మన దరికి చేరకుండా ఇది కాపాడుతుంది.మధుమేహం ఇంకా అలాగే అధిక రక్తపోటు ఇలా ఎలాంటి సమస్యకైనా సరిపడా నీళ్లు తాగకపోవడం కారణమని చెప్పుకోవచ్చు. ఇక సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లు వేసవిలో చాలా రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి. డయాలసిస్ తీసుకుంటున్నవాళ్లు ఇంకా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవాళ్లు, లేదా అలాంటి తత్వం కలిగినవాళ్లు శరీరంలో నీటి శాతం సమంగా ఉండేలా చూసుకోవాలి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Health care, Hospitals, Hyderabad, Kidney

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు