హోమ్ /వార్తలు /తెలంగాణ /

Body builder selling Onions: ఊరూరా తిరిగి.. ఉల్లిపాయలు అమ్ముతున్న బాడీబిల్డర్​.. ఎవరీ కండలవీరుడు.. ఎందుకీ పరిస్థితి?

Body builder selling Onions: ఊరూరా తిరిగి.. ఉల్లిపాయలు అమ్ముతున్న బాడీబిల్డర్​.. ఎవరీ కండలవీరుడు.. ఎందుకీ పరిస్థితి?

బాడీ బిల్డర్​ భద్రయ్య

బాడీ బిల్డర్​ భద్రయ్య

భద్రయ్యను వ్యాయామశాల గోడలపై చిత్రించిన బాడీబిల్డర్ల శరీర సౌష్టవ చిత్రాలు అతడిలో ఆసక్తిని రేకెత్తించాయి. అనుకున్నదే తడువుగా బక్కపల్చగా ఉండే తన శరీర నిర్మాణాన్ని ధృడంగా మార్చుకున్నాడు. అయితే అక్కడే అసలు కథ మొదలైంది.

(Uday raj, Bhadradri kothagudem)

ఊరూరా తిరిగి ఉల్లిపాయలమ్మే (selling Onions) అతడు కండలవీరుడు కావాలని కలలు కన్నాడు. కాయా కష్టం చేసి కడుపు నింపుకుంటూనే కసరత్తులు మొదలు పెట్టాడు. ఇరవై ఏళ్లుగా వర్కవుట్స్ చేస్తూ ధృడమైన శరీరాన్ని నిర్మిస్తున్నాడు. కూటి కోసం కష్టం చేస్తూనే వీలు దొరికినప్పుడల్లా తన కల కోసం శ్రమిస్తున్నాడు. బాడీబిల్డింగ్ లో ప్రతిభను చాటుతూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న బాడీబిల్డర్ ఉల్లిగడ్డల భద్రయ్య (Body builder Bhadraiah) స్టోరీ తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం  (Bhadradri Kothagudem)జిల్లా ఇల్లందుకు (Ellandu) చెందిన తల్లాడ లక్షీనారాయణ, రాధమ్మ దంపతుల రెండో సంతానమే భద్రయ్య (Bhadraiah). అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన భద్రయ్య చిన్ననాటి నుంచి తన రెక్కల కష్టంపైనే ఎదిగాడు. అనారోగ్యంతో భద్రయ్య తల్లిదండ్రులు మరణించడంతో అతడి బరువు బాధ్యతను అన్నా, వదినలే చూసుకున్నారు. వారికి బరువు కాకూడదని భావించిన భద్రయ్య  సమోసాలు, ఐస్ క్రీంలు, ఉల్లిపాయలు అమ్ముకుంటూ  (Onion selling)జీవనం సాగించేవాడు.

వీధివ్యాపారం సాగిస్తున్న భద్రయ్యను వ్యాయామశాల గోడలపై చిత్రించిన బాడీబిల్డర్ల శరీర సౌష్టవ చిత్రాలు (Body builder Pictures) అతడిలో ఆసక్తిని పెంచాయి. అనుకున్నదే తడువుగా బక్కపల్చగా ఉండే తన శరీర నిర్మాణాన్ని ధృడంగా రూపుదిద్దాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం వరకు ఉల్లిపాయలు అమ్మి ఇంటికి తిరిగొచ్చి వ్యాయామశాలకు (Gym) వెళ్లడం ప్రారంభించాడు.

ఆసక్తిని గమనించిన బాడీబిల్డింగ్ కోచ్..

రాత్రిళ్లు వర్కవుట్స్ (Night workouts) చేస్తూ పగలు పనికి వెళుతుండేవాడు. బాడీబిల్డింగ్ పై అతడికున్న ఆసక్తిని గమనించిన బాడీబిల్డింగ్ (Body building) కోచ్ అబ్దుల్ మన్నన్ అతడిని చేరదీసి తన సొంత జిమ్ లో ఉచిత శిక్షణ అందించాడు. కోచ్ తో పాటు స్నేహితులు అందించిన సహకారంతో శరీర సౌష్టవ ప్రదర్శన పోటీల్లో పాల్గొన్న భద్రయ్య జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో తన ప్రతిభను చాటాడు.

రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో ఆరుసార్లు ప్రథమ బహుమతి సాధించాడు. తదనంతరం హర్యానా, మణిపూర్ రాష్ట్రాలలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినా కేవలం ప్రయాణ ఖర్చులకు సరిపడా నగదు లేక పోటీలకు దూరమయ్యాడు. ఈసారి జరగబోయే జాతీయ, అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు.

నెలవారీ డైట్ ఖర్చు దాదాపు రూ. 10 వేలు..

శరీర తత్వానికి అనుకూలంగా సౌష్టవ నిర్మాణాన్ని స్థిరంగా ఉంచడం బాడీబిల్డర్లకు అతిముఖ్యమైనది. ధృడమైన శరీరాకృతి కోసం వారు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు.  క్రీడారంగంలో మిగిలిన విభాగాలతో పోలిస్తే బాడీబిల్డింగ్ లో రాణించడం తీవ్ర వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఓ బాడీబిల్డర్ సాధారణ నెలవారీ డైట్ దాదాపు పదివేల రూపాయలు ఉంటుంది. శరీరాకృతి. ఫిట్ నెస్, షేప్ అవుట్ కోసం ప్రతిరోజూ పాలు, గుడ్లు, మాంసకృత్తులను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భద్రయ్యది వ్యాయామ శాల ఫీజు కూడా చెల్లించలేని దుర్భర పరిస్థితి. అతడి దీనస్థితిని చూసి తోటి బాడీబిల్డర్లే ఆవేదన చెందుతున్నారు.

ఈ భద్రయ్య ఇప్పుడు పాత సామన్లకు ఉల్లిపాయలు ఇవ్వడం లాంటి పని చేస్తున్నారు. బాడీ బిల్డర్‌గా ఉండాల్సిన వ్యక్తి ఇలా వీధి వీధి తిరిగి ఉల్లిపాయలు అమ్మడంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి పట్టుదలతో బాడీబిల్డింగ్ విభాగంలో రాణిస్తున్న భద్రయ్య లాంటి వారెందరో ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలు లేక వెనక్కివెళ్లిపోతున్నారని చెబుతున్నారు. డైట్ కు డబ్బులు లేక శరీరాకృతిని కాపాడుకునేందుకు కొందరు బౌన్సర్లుగా, మరికొందరు దొరికిన పని చేసుకుంటున్నారు.


అయితే తను కన్నకలను నిజంచేసేవరకు విశ్రమించబోనని జాతీయ, అంతర్జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల ప్రదర్శనలో సత్తాచాటడమే తన లక్ష్యమని అంటున్నాడు భద్రయ్య . తన కష్టానికి ప్రభుత్వ సహకారం తోడైతే పథకాలు పక్కాగా సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.

First published:

Tags: Bhadradri kothagudem, Khammam, Onion

ఉత్తమ కథలు