Home /News /telangana /

A MAN COMMITS SUICIDE AFTER TRS LOSING DUBBAKA BYPOLLS DETAILS HERE MS MDK

Dubbaka Bypolls 2020: టీఆర్ఎస్ ఓడిపోయిందని అభిమాని ఆత్మహత్య

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

తాను ఎంతగానో అభిమానించిన పార్టీ విజయం ముంగిట చేతులెత్తయడంతో ఆ అభిమాని తట్టుకోలేకపోయాడు. తన పార్టీ ఓడిపోవడం అతడిని కలిచివేసింది.

  • News18
  • Last Updated :
    నిన్న ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ లో టీఆర్ఎస్ ఓడిపోవడాన్ని తట్టుకోలేని ఒక అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయం ముంగిట టీఆర్ఎస్ బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వేయి ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీఆర్ఎస్ ఓటమి పాలవడాన్ని తట్టుకోలేని ఆ అభిమాని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం లేచి చూడంగానే  అక్కడున్నవారందరూ ఈ ఘటన చూసి షాక్ తిన్నారు. వివరాలిలా ఉన్నాయి.

    దుబ్బాక ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ ఓడిపోవడాన్ని చూసి తట్టుకోలేని అభిమాని.. ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని స్వామిగా గుర్తించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం.. కొనాయిపల్లికి చెందిన స్వామి (34) మొదట్నుంచి టీఆర్ఎస్ అభిమాని. దుబ్బాక లో సోలిపేట రామలింగారెడ్డిని, మంత్రి హరీశ్ రావు, సీఎం కేసీఆర్ కు ఆయన వీరాభిమాని. వారినెవరైనా ఏమైనా అంటే అవతలివారికి సరైన బదులిచ్చేవాడు.

    టీఆర్ఎస్ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా.. తాను శక్తి వంచన లేకుండా పనిచేసేవాడు. కానీ దుబ్బాక లో ఫలితం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో స్వామి తట్టుకోలేకపోయాడు. మంగళవారం అర్థరాత్రి గ్రామంలో ఉన్న వేపచెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. స్వామికి పెళ్లి కూడా అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Dubbaka By Elections 2020, Siddipet, Telangana, Telangana News, Trs

    తదుపరి వార్తలు