Home /News /telangana /

A MAN CAME TO HOME AFTER HIS FINAL FUNERALS IN KOTHAGUDEM VRY

Kothagudem : సాయంత్రం అంత్యక్రియలు .. రాత్రికే తిరిగి వచ్చాడు.. ఎలా... ?

ప్రసాద్

ప్రసాద్

Kothagudem : చనిపోయిన వ్యక్తికి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.అయితే ఆ వ్యక్తి తిరిగి రాత్రి ఇంటికి చేరుకున్నాడు..ఇది ఇంటి సభ్యులు షాక్‌కు గురయ్యారు. దీపావళీ వేళ కొడుకు చనిపోయాడని ఏడుస్తున్న వారికి ఇది శుభవార్త అయినా.. అసలు చనిపోయింది ఎవరనే ప్రశ్న పోలీసులను వెంటాడుతోంది.

ఇంకా చదవండి ...
    పండగ పూట ఓ వ్యక్తి చనిపోతే ఆ బాధ కుటుంబ సభ్యులకు వర్ణణాతీతం. కేవలం అయిదు రోజుల క్రితం ఇంటినుండి పోయి హఠాత్తుగా శవంగా మారడం.. ఆ శవం గుర్తుపట్టలేని విధంగా మారడంతో పాటు కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుడే అని గుర్తుపట్టడడంతో త్వరత్వరగా బాడీకి పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడుకు చెందిన బొడ్డు ప్రసాద్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా గ్రామంలోనే ఓ వ్యక్తి వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల యజమాని.. ప్రసాద్‌ను కొట్టాడు. తర్వాత చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అయితే, కొన్ని రోజులకు డ్రైవర్‌ ప్రసాద్‌ అదృశ్యం కాగా.. ఆయన తల్లి ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు విచారణ సాగిస్తుండగానే ఫిర్యాదు చేసిన మరునాడే సమీపంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది.

    ఇది చదవండి : చిల్లర డబ్బుల కోసం హత్యలు చేసే సైకో కిల్లర్.. మాట వినలేదంటే అంతే.. !


    అయితే ఆ మృతదేహం గుర్తు పట్టకుండా తయారు అయింది... మృత దేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఒకరోజు ముందుగానే మిస్సింగ్ కేసు నమోదు చేయించిన ప్రసాద్ కుటుంబానికి సమాచారం అందించారు.. ఆయన కుటుంబ సభ్యులను పిలిపించారు.. అప్పటికే కుళ్లిన స్థితిలో ఉండటంతో అది ప్రసాద్‌దిగానే భావించిన కుటుంబ సభ్యులు తమ గ్రామానికి కూడా తీసుకుని వెళ్లకుండా ఆ రాత్రి ప్రాజెక్ట్‌ సమీపానే అంత్యక్రియలు నిర్వహించారు.

    ఇది చవదండి : పాడి కౌశిక్ రెడ్డికి మరో అవకాశం.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా.... ?


    కాగా ప్రసాద్ పారిపోవడానికి కారణమైన ట్రాక్టర్‌ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే చనిపోయాడుకున్న ప్రసాద్ కుటుంబ సభ్యులను షాక్‌కు గురి చేస్తూ.. అంత్యక్రియలు జరిగిన ఉదయమే.. ప్రసాద్‌ చర్లలో ప్రత్యక్షం అయ్యాడు.. దీంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు..

    అయితే.. ట్రాక్టర్‌ యజమాని మళ్లీ కొడతాడేమోననే భయంతో తాను ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో తలదాచుకున్నట్లు వివరించాడు. ఇక రిజర్వాయర్‌లో ప్రత్యక్షమైన మృతదేహం ప్రసాద్‌ది కాదని తేలడం, మృతదేహం కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో ఎవరినో హత్య చేసినట్లు భావిస్తూ కేసు దర్యాప్తు చేపట్టారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bhadrari kothagudem, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు