Telangana : మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబు..రెచ్చిపోయి ఏం చేశాడంటే..

బైకు తగలబడుతున్న దృశ్యం

SangaReddy : మద్యం మత్తులో ఓ మందు బాబు రెచ్చిపోయాడు. పూటుగా తాగి వీరంగం సృష్టించాడు.

  • Share this:
    మద్యం మత్తులో ఓ మందు బాబు రెచ్చిపోయాడు. పూటుగా తాగి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఓ ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో వేరే వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాగిన వ్యక్తితో గొడవ ఎందుకు అనుకున్న వ్యక్తి తన ఇంటికి వెళ్లిపోయాడు. కానీ, మందు బాబు అతని మీద కోపంతో రగిలిపోయాడు. అతడి ద్విచక్ర వాహనం అక్కడే ఉండగా దాన్ని మీద కోపం చూపించబోయాడు. కానీ అతని మత్తులో పప్పులో కాలేశాడు. అతనితో గొడవ పడ్డ వ్యక్తి ద్విచక్ర వాహనానికి బదులు వేరే వ్యక్తి బైకును నిప్పంటించాడు. దీంతో బైకు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Sridhar Reddy
    First published: