హోమ్ /వార్తలు /telangana /

Nizamabad : వెంటాడిన మృత్యువు.. ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన రెండు రోజులకే మృతి...

Nizamabad : వెంటాడిన మృత్యువు.. ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన రెండు రోజులకే మృతి...

బాధిత కుటుంబం

బాధిత కుటుంబం

Nizamabad : ఉన్న ఊరిలో ఉపాధి లేక భ‌విష్య‌త్తు పై ఎంతో ఆశ‌తో గ‌ల్ఫ్ బాట‌ప‌ట్టిన ఓ కార్మికుడి కుటుంబంలో విషాదం నెలకొంది....బతుకు దెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన రెండు రోజులకే రొడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు..

  త‌న కుటుంబానికి మూడు పుట‌ల క‌డుపు నింపాల‌ని పొట్ట చేతపట్టుకుని.. దేశం కానీ దేశానికి వెళ్లాడు. తాను ఒకటి తలిస్తే.. దైవం మ‌రోక‌టి తలచింది.. గల్ప్ కు వెళ్లిన రెండు రోజులకే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది.. దీంతో ఆ కుటుంబ‌ ఆశలు ఆవిరయ్యాయి. కుటుంబానికి దూరంగా ఉండైనా ఆర్ధిక అభివృద్ది చెందాలనే తపన మృత్యు ఒడికి చేర్చింది. దీంతో చివరి చూపుల కోసం.. ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.. ప్రమాదంలో మృతి చెందిన తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

  నిజామబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి కి చెందిన ఈర్ల నారాయణకు ఒక్క‌గానోక్క కూతురు లావ‌ణ్య.. అయితే ఈర్ల నారాయ‌ణ‌ ఇంటికి శంకర్  15 ఏళ్ల క్రితం ఇల్లరికం వచ్చాడు.. . నారాయణ కూతురు లావ‌ణ్య‌తో  శంకర్ కు వివాహం చేసారు.. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అయితే ఇటివల ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ‌య్యాయి.. దీంతో ఉపాధి కోసం అప్పు చేసి గ‌ల్ఫ్ దేశం వెళ్లేదుకు సిద్ద‌మ‌య్యాడు.. విజీట్ విసాతో శంక‌ర్ దుబాయ్ వెళ్లాడు.. దుబాయి చేరిన త‌రువాత శంకర్ కుటుంబ స‌భ్యుల‌ను పోన్ చేసి త‌ాను చేరుకున్నాను అని పోన్ చేసారు.. దీంతో కుటుంబ స‌భ్యులు ఆర్ధిక స‌మ‌స్య‌లు స‌మ‌సిపోతాయ‌ని ఆనంద ప‌డ్డారు..

  Kamareddy : ఆ.. నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయం... అందుకే నాపై దుష్ప్రచారం.

  అయితే ఇక్కడే వారిని దురదృష్టం వెంటాడింది.. మరొ కొద్ది గంటల్లో పనులు ప్రారంభించే సమయానికే... ఆ ఇంటికి షాకింగ్ వార్త తెలిసింది.. దుబాయి చేరుకున్న రెండ‌వ రోజు తాను తీసుకువెళ్లిన ఇండియా క‌రెన్సి మార్చు కునేందుకు శంకర్ బయటకు వెళ్లాడు. దుబాయి క‌రెన్సిగా మార్చుకుని తిరిగి వ‌స్తుండ‌గా గుర్తు తెలియని వాహ‌నం డీ కోని శంకర్ స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు.. దీంతో  ఆ కుటుంబం రోడ్డున ప‌డింది..  శంక‌ర్ మృతి చెందిన విష‌యం తెలిస‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యాతం అయ్యారు..


  TS news : ఏటిఎం కార్డులే.. పెట్టుబడిగా నయా దందా...! అధిక వడ్డీలకు కార్మికులు విలవిల

  అప్పటికే అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన కార్మిక కుటుంబం పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఓ వైపు అప్పులు మరోవైపు మృత దేహాన్ని కూడా తీసుకురాలేని స్థితికి చేరుకున్నారు. దీంతో ఆ కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. బాడీని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతోంది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Accident, Dubai, Nizamabad District

  ఉత్తమ కథలు