హోమ్ /వార్తలు /తెలంగాణ /

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు..కవిత సన్నిహితుడి అరెస్ట్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు..కవిత సన్నిహితుడి అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలన రేపింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఈడీ (Enforcement Directorate) దూకుడు పెంచింది.  ఈ కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు అరెస్ట్ చేసిన సిబిఐ  తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసి విచారిస్తుంది.

తాజా అరెస్టుతో హైదరాబాద్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. రాబిన్ డిస్టిలర్స్ డైరెక్టర్ అభిషేక్ రావును సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి మరోసారి హైదరాబాద్, ఢిల్లీ , పంజాబ్ లో ఈడీ  (Enforcement Directorate) అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే అభిషేక్ రావును అరెస్ట్ చేశారు. అభిషేక్ కు రామచంద్ర పిళ్ళైతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు అభిషేక్ రావు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడిగా తెలుస్తుంది.

అరెస్ట్ అయిన అభిషేక్ రావు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం 9 కంపెనీల్లో వాటాలు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఆ కంపెనీల్లో వివిధ వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. రియల్ ఎస్టేట్, మైనింగ్ క్వారీయింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసులు ఉన్నాయి. అభిషేక్ రావుకు అనూస్ బ్యూటీపార్లలో డిస్టిలరీస్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది.  అభిషేక్ ను అరెస్ట్ చేసిన సీబీఐ అతడిని ఢిల్లీకి తరలించినట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం అక్కడే అభిషేక్ రావును విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ వెల్లడించే సమాచారం ఇప్పుడు కీలకంగా మారబోతుంది.

ఇక లిక్కర్ స్కామ్ Delhi Liquor Scam లో కీలక పాత్ర పోషించిన విజయ్ నాయర్, సమీర్ మహేంద్రును ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్స్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇతను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సన్నిహితుడైన దినేష్ ఆరోరా బ్యాంక్ ఖాతాలోకి రూ.కోటి ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ  (Enforcement Directorate) అధికారులు గుర్తించారు. ఇక ఆ తర్వాత డబ్బు సిసోడియాకు చేరిందని సీబీఐ ఆరోపించింది. అలాగే కోట్ల రూపాయల నగదు బదిలీ చేసిన విజయ్ నాయర్, రామచంద్ర పిళ్ళై, అర్జున్ పాండే మీద ఈడీ  (Enforcement Directorate) కేసులు నమోదు చేసింది.  ఇక అభిషేక్ రావు అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ డొంకంతా కదులుతుందని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ నుండి తరువాత ఎవరు అరెస్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

First published:

Tags: CBI, Hyderabad

ఉత్తమ కథలు