వినాయక నిమజ్జనంలో (Ganesh immersion) చివరి అంకం, లడ్డూ వేలం. ఇటివల లడ్డూ వేలంకు(Laddu auction) బాగా క్రేజ్ పెరిగింది. లడ్డూ పాటలు ఇంతింతై వటుండింతై.. అన్నట్టు పెద్ద పెద్ద వినాయకుల నుండి గళ్లీ స్థాయిలో కూడా వినాయక విగ్రహాల వద్ద ఉన్న లడ్డూలు వేలం వేస్తున్నారు.
దీంతో ఆయా ప్రాంతాల్లో కొంతమంది భక్తితో లడ్డూలో వేలం పాటలో పాల్గొంటుండగా మరికొంత మంది పరువు కోసం పాల్గొంటున్నారు. ఇంకా.. కొంతమంది లడ్డూ కొన్నవాళ్లకు కలిసి వస్తుందనే నమ్మకంతో ముందుకు వస్తున్న పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో కనిపిస్తోంది.
ఇది చదవండి : మద్యం హోం డెలివరీపై ప్రజల అభిప్రాయం ఏంటంటే..? హైదరాబాదీల మనసులో మాట ఇదే
ఈ క్రమంలోనే లడ్డూ వేలం పాటలు ఒక్కసారిగా లక్షల రూపాయల ధరలు (lakhs of rupees ) పలుకుతున్నాయి. వేలంలో లడ్డూను దక్కించుకున్న వారు ఉత్సహంతో ఊరేగింపుగా లడ్డూను తీసుకువెళుతున్నారు. దీంతో ఆ లడ్డూను తీసుకున్న కుటుంబానికి కొంత ప్రత్యేకత ఇస్తున్న పరిస్థితి నిమజ్జన కార్యక్రమాల్లో కనిపిస్తోంది.
అయితే ఇలాంటీ లడ్డూ వేలం పాటలు ఓ కుటుంబంలో చిచ్చు పెట్టాయి. వినాయకుని లడ్డూ కొంటే కలిసి వస్తుందన్న నమ్మకంతో ఓ వ్యక్తి తనకు, ఆ స్థోమత లేకున్నా.. లడ్డూ వేలంలో పాల్గొన్నాడు.ఓ వైపు అప్పులు(debts) ఉన్నా.. వేలంలో పాల్గొని, లడ్డూను దక్కించుకోవడంతో అతని భార్య (wife) మందలించింది. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా (nalgonda) నేరెడుగొమ్మ మండలం పెద్దమ్మ తండాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామనికి చెందిన రమావత్ శ్రీను(srinu) అనే వ్యక్తి 26 వేల రూపాయలకు గ్రామంలోని వినాయకుని వద్ద వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు. దీంతో అప్పలు తీర్చలేని పరిస్థితిలో వేలంలో ఎందుకు పాల్గోన్నావని భార్య నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో భర్త శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా ఆదివారం జరిగిన వినాయక నిమజ్జనాల్లో బాలాపూర్ (Balapur)లడ్డూను 18 లక్షల 90 వేలకు ఇద్దరు భక్తులు దక్కించుకున్నారు. అంతకు ముందు సంవత్సరం లడ్డూను 17 లక్షల 60 వేలు కాగా గత కొన్ని సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డూతోనే రాష్ట్ర వ్యాప్తంగా వేలం పాటలకు క్రేజ్ పెరిగింది.
దీంతో నగరంలో ఇలాంటీ లడ్డూ వేలం పాటల్లో నలబై నుండి యాబై లక్షల రూపాయలు కూడా వేలం పాడి లడ్డూను దక్కించుకున్న ప్రాంతాలు సైతం ఉన్నాయి. ఏది ఏమైనా లడ్డూల వేలం ఓవైపు ప్రజల్లో క్రేజ్ పెంచుతూనే.. మరోవైపు కొన్ని కుటుంబాల్లో(Families) విషాదాన్ని కూడా నింపుతున్నాయి..
అయితే వేలంలో పాల్గోనే వారు తమ అర్ధిక పరిస్థితి బట్టి పాల్గొనాలి తప్ప ఏదో ఆశించి పాల్గొనడం ద్వారా కుటుంబంతో పాటు సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఎదురవతాయని ఈ సంఘటనను బట్టి అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh immersion, Nalgonda, Telangana News