హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda : ఇదేంటి మాష్టారు..? స్కూలు పిల్లలతో పాటు.. తల్లులను కూడా ఇలా చేస్తారా...?

Nalgonda : ఇదేంటి మాష్టారు..? స్కూలు పిల్లలతో పాటు.. తల్లులను కూడా ఇలా చేస్తారా...?

Nalgonda : పిల్లలనే కాదు.. వారి తల్లులను కూడా లైంగిక వేధింపులకు ( sexual harassment )గురి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఓ ప్రభుత్వ పాఠశాల ( Govt Teacher ) ప్రాధానోపాధ్యాయుడు ..ఆ మాష్టారు లైంగిక వేధింపులు భరించలేక పిల్లలతో కలిసి తల్లిదండ్రులు స్కూలు ముందే ధర్నా చేపట్టారు.

ఇంకా చదవండి ...

  పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదంటే ఏదో ఒక కారణం అయి ఉంటుంది. అయితే ఆ కారణం నేరుగా ఉపాధ్యాయులే అయితే విద్యార్థుల భవిష్యత్ ఏమవుతోంది. సమాజానికి మంచి చెడులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కామంతో కళ్లుమూసుకుపోతే ఎవరిని ప్రశ్నించాలి. సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలను సైతం విద్యాసంస్థల్లో భోదించే వైపు అడుగులు పడుతుంటే.. నేరుగా ఉపాధ్యాయులే పిల్లలను లైంగికంగా వేధిస్తే ఆ సంస్కరణల ఫలితం దక్కుతుందా.. ఇటివల కాలంలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులను ఏమనాలి. అందుకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం వారే అందోళన బాటపట్టారు. ఇలా తాజాగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు 6,7 వ తరగతి చదువుతున్న ఆడపిల్లలను లైంగికంగా వేధింపులు చేయడంతోపాటు వారితో అసభ్యంగా ప్రవర్తించడం భరించలేని పిల్లలు ఆందోళన బాట పట్టారు.

  నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా ఉన్న నర్సింహ ఆ స్కూళ్లో సైన్స్ సబ్జెక్ట్ టీచర్‌ పాఠాలు భోదిస్తూ హెడ్ మాస్టారుగా ఉన్నారు. అయితే ఆయన 6 ,7 వతరగతి పాఠాలు బోధించే సమయంతోపాటు బయట కూడా ఆ క్లాస్ విద్యార్ధిలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలికలను ముద్దుపెట్టుకోవడం, వారిని అసభ్యకరంగా తాకడం లాంటీ వెకిలి చేష్టలు చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే స్కూలుకు తమ పిల్లలను తీసుకువచ్చే తల్లులపై కూడా కన్నెశాడు. వారిని ఫోన్ చేయమని చెప్పడం, సిటికి వస్తే చీరలు కొనివ్వడం తోపాటు ఫోన్ రీచార్జ్ చేస్తానని చెప్పడం లాంటి వేధింపులకు పాల్పడేవాడు. అయితే ఇలా ఈ మధ్యకాలంలో నర్సింహ వేధింపులు ఎక్కువకావడంతో పిల్లలు భరించలేని స్థాయికి చేరారు. దీంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గత నెల క్రితమే స్కూళుకు వెళ్లి హెచ్చరించారు.

  Telangana : ప్రియుడు వరంగల్‌లో ప్రియురాలు బిహర్‌లో.. ప్రియురాలు ఫోన్ లిప్టు చేయడం లేదని..

  హెడ్‌మాస్టార్‌పై పోక్సో కేసు

  దీంతో పిల్లలపై మరింత కక్ష పెంచుకున్న నర్సింహ ఇటివల పిల్లలను విపరీతంగా కొట్టడం తోపాటు అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డాడు.దీంతో కొంతమంది విద్యార్థులు తాము స్కూలుకు వెళ్లమని ఏడ్వడంతో తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. మంగళవారం స్కూలుకు వెళ్లి విచారణ జరిపారు.అప్పటికే విషయం తెలుసుకున్న నర్సింహ స్కూలు రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు తమ పిల్లలతో కలిసి స్కూలు ముందే ధర్నా చేపట్టారు. హెడ్ మాస్టర్ నర్సింహను శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారి ఫిర్యాదు మేరు ఆయనపై పోక్సో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

  తాను ఏ తప్పు చేయలేదు.. నర్సింహ

  అయితే ప్రధానోపాధ్యాయుడు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నాడు.పిల్లలను సన్మార్గంలో పెట్టాలని మాత్రమే తాను మాట్లాడని, వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాని నిన్న స్కూలు రాకుండా ఫోన్ స్విచాఫ్ పెట్టుకున్నట్టు సమాచారం.

  First published:

  Tags: Crime, Nalgonda

  ఉత్తమ కథలు