సిద్ధిపేటలో విషాదం.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆడుతుండగా బాలిక..

ఇంట్లో తన తండ్రి సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుంది. ఈ క్రమంలో ఛార్జర్ తీగ తేలి ఉండడంతో స్రవంతికి షాక్ కొట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే చనిపోయింది.

news18-telugu
Updated: May 23, 2020, 8:44 PM IST
సిద్ధిపేటలో విషాదం.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆడుతుండగా బాలిక..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సిద్ధిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్‌తో ఆట ఆడుతుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఓ బాలిక అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన కిష్టయ్య, బాలమణి దంపతులు. వీరికి కూతురు సవ్రంతి(8) ఉంది. శనివారం ఇంట్లో తన తండ్రి సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుంది. ఈ క్రమంలో ఛార్జర్ తీగ తేలి ఉండడంతో స్రవంతికి షాక్ కొట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. సరదా కోసమని సెల్‌ఫోన్‌తో గేమ్ ఆడే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading