ఇటివల పిల్లలు సైతం పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. తమకు ఏ సమస్య ఉన్నా నేరుగా స్టేషన్‌కు వెళ్లి బెనుకు లేకుండా ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఇటివల స్కూలుకు వెళ్లే ఓ బుడతడు నేరుగా తన తోటి విద్యార్థులను తీసుకుని తన పెన్సిల్ పోయిందంటూ ఫిర్యాదు చేశాడు.. పైగా ఆ పెన్సిల్ తీసుకుంది వీడే అంటూ పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ సంఘటన కాస్తా వైరల్‌గా మారింది. పెద్దవాళ్ల ఏదైనా కేసులో వెళ్లి ఫిర్యాదు ఇవ్వాలంటే భయపడి పోతారు. పోలీసు అధికారులతో ఎలా మాట్లాడాలో తెలియక ఆందోళన చెందుతారు. కాని ఆ బుడతడు చేసిన పనికి చాలామంది ఫిదా అయ్యారు.
ఇక తాజాగా మరో పిల్లాడు ఇదే పద్దతిలో స్టేషన్‌కు వెళ్లాడు. తన సైకిల్ పోయిందంటూ ఫిర్యాదు చేశాడు. తన సైకిల్ తనకు ఇప్పించాలని పోలీసులను బతిమిలాడాడు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని 11 సంవత్సరాల బాలుడు స్వాత్విక్ తన సైకిల్ కనిపించడం లేదంటూ స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి చెందిన ఆశోక్, రజిత దంపతులకు కుమారుడు స్వాత్విక్, స్థానిక ప్రవేట్ స్కూల్ లో నాలుగవ తరగతి చదువుతున్నాడు . కాగా ఇటివల సంక్రాంతి సెలవులు రావడంతో తన తల్లిదండ్రులతో కలిసి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు.. పండగ అయిన తర్వాత తిరిగి నిన్న మంగళవారం ఇంటికి చేరుకున్నాడు.. కాగా ఇంటికి వచ్చి చూసే సరికి తాను ఇంట్లో పెట్టి వెళ్లిన సైకిల్ కనిపించ లేదు. దీంతో తన స్నేహితులను కూడా ఆరా తీశాడు.. చివరకు ఎవరో ఎత్తుకెళ్లారని భావించిన ఆ పిల్లాడు.. తల్లి దండ్రులకు చెప్పకుండా తన స్నేహితుల సాయంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
Khammam : ముందుగా మర్యాద రామన్న ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మాములుగా లేదు కథ..
దీంతో బాలుడు పోలీసు స్టేషన్‌కు వచ్చిన విషయాన్ని గమనించిన స్టేషన్ ఎస్సై దగ్గరకు పిలుచుకొని ఎసై ఆరా తీశాడు. స్టేషన్‌కు ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు.. దీంతో తన సైకిల్ పోయిందనే విషయాన్ని ఎస్సైకి ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక ఎస్సై తిరుపతి బాలుడి తండ్రి అశోక్‌కు ఫోన్ నంబర్ తీసుకుని కాల్ చేశాడు. దీంతో ఖంగు తిన్న బాలుడి తండ్రి వెంటనే విషయం చెప్పాడు. అసలు సైకిల్ ఎవరు దొంగిలించలేదని., కరోనా సమయంలో పిల్లాడు విపరీతంగా సైకిల్ పై తిరుగుతుండడంతో తామే పిల్లాడికి కనబడకుండా దాచి పెట్టామని చెప్పారు. అయితే పిల్లాడు ఫిర్యాదుకు న్యాయం చేయాల్సిన భాద్యత పోలీసులపై ఉండడంతో వెంటనే అశోక్‌ను పిలిపించి దాచి పెట్టిన సైకిల్ ను సాత్విక్‌కు ఇప్పించారు. ఆ తర్వాత కరోనా సమయంలో ఎక్కువగా తిరగవద్దంటూ హితవు చెప్పి పంపించాడు. సో మొత్తం మీద పిల్లలు చేసే పనులకు ఒక్కోసారి షాక్ గురవడం మాములే అయినా ఈ స్థాయిలో తమకు తెలియకుండా నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.