మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రక్తదానం.. ఎందుకో తెలుసా..

రక్తదానం చేస్తున్న మాజీ ఎంపీ కవిత

టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో రక్తదానం చేశారు.

  • Share this:
    తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం రక్తదానం చేశారు. అన్నిదానాల కన్నా రక్తదానం గొప్పదని, యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో రక్తదానం చేశారు. రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు నిలబెడుతుందన్నారు. తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించేందుకు రక్తదానం చేసినట్టు చెప్పారు. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండు టీఆర్ఎస్ కార్యకర్తలు, వీలైనంత ఎక్కవగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.
    Published by:Narsimha Badhini
    First published: