పంజా విసురుతున్న డెంగీ.. వ్యాధితో ఐదేళ్ల బాలిక మృతి..

Dengue Fever: గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా డెంగీతో ఐదుగురు మృతి చెందగా, ఈ ఏడాది 50 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 4, 2019, 11:48 AM IST
పంజా విసురుతున్న డెంగీ.. వ్యాధితో ఐదేళ్ల బాలిక మృతి..
రిత్విక (ఫైల్)
  • Share this:
తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా చోట్ల డెంగీతో మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తున్నా.. అధికారులు సంఖ్యను వెల్లడించకుండా దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా డెంగీతో ఐదుగురు మృతి చెందగా, ఈ ఏడాది 50 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఫీవర్ హాస్పిటల్‌ను సందర్శించి.. వ్యాధి నియంత్రణ కోసం అధికారులతో చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచితంగా డెంగీ పరీక్షలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు.. ఉచితంగా హోమియో మందు కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది.

ఇదిలా ఉండగా తాజాగా, రిత్విక అనే ఐదేళ్ల బాలిక డెంగీ వ్యాధితో మృతి చెందింది. సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌కు చెందిన ఈ బాలిక డెంగీ జ్వరంతో బాధపడుతూ మృతిచెందింది. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు అలర్ట్ ప్రకటించారు. మృతుల సంఖ్య పెరుగుతున్నందున వ్యాధి నియంత్రణకు తక్షణ చర్యలకు ఉపక్రమించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 4, 2019, 11:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading