హోమ్ /వార్తలు /తెలంగాణ /

Train fire accident today: ఏపీ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. బోగీల్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికుల హాహాకారాలు.. నిలిచిన రైలు

Train fire accident today: ఏపీ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. బోగీల్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికుల హాహాకారాలు.. నిలిచిన రైలు

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేగింది. శుక్రవారం తెల్లవారుజామున రైలులోని ఎస్‌6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు.

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేగింది. శుక్రవారం తెల్లవారుజామున రైలులోని ఎస్‌6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు.

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేగింది. శుక్రవారం తెల్లవారుజామున రైలులోని ఎస్‌6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు.

  విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (AP Express)లో అగ్నిప్రమాదం సంభవించడంతో కలకలం రేగింది. శుక్రవారం తెల్లవారుజామున రైలులోని ఎస్‌6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు (Passengers) ఉలిక్కిపడ్డారు. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి అధికారులకు సమాచారమిచ్చారు. రైలు నిలిచిపోగానే ప్రయాణీకులు తమ లగేజీలను తీసుకుని కింది దిగిపోయారు.

  వెంటనే అక్కడికి చేరుకున్న టెక్నికల్ సిబ్బంది (Technical Team) పరిస్థితిని సమీక్షించారు. ట్రైన్ బ్రేకులు ( Breaks) జామ్ కావడంతోనే పొగలు వచ్చాయని, అంతకుమించి ఆందోళన చెందాల్సినదేమీ లేదని తేల్చి అధికారులకు సమాచారమిచ్చారు. సమస్య పరిష్కారమైన వెంటనే ఏపీ ఎక్స్‌ప్రెస్ (AP Express) తిరిగి బయలుదేరి వెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణీకులు సుమారు గంట పాటు నెక్కొండ రైల్వేస్టేషన్లోనే పడిగాపులు పడ్డారు. కాగా, రెండేళ్ల కిందట కూడా ఏపీ ఎక్స్​ప్రెస్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్రేక్​ పట్టేయడంతో ప్రమాదం సంభవించింది.

  రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా..

  ఇటీవలె ఝార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం (Rail accident) జరిగిన విషయం తెలిసిందే. హతియా-రూర్కెలా రైలు మార్గంలో గత నెలలోనే రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాత్రి 10 గంటల సమయంలో కురుకురా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రెండు రైళ్ల ఇంజిన్‌లు దెబ్బతిన్నాయి. లోకో పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్కలు చేపట్టారు. ఇంజిన్ క్యాబిన్‌లో ఇరుక్కున్న లోకో పైలట్లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉంది. అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం.. ఒక గూడ్స్రైలురూర్కెలా నుండి రాంచీకి వెళ్తుండగా.. మరొక రైలు రాంచీ నుండి రూర్కెలాకు వెళ్తోంది. ఇందులో ఒకటి సరుకుతో వెళ్తుండగా... మరొకటి ఖాళీ బోగీలతో వెళ్తోంది. రైఈ ప్రమాదం కారణంగా హతియా-రూర్కెలా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.


  రెండు రైళ్లు ఒకేట్రాక్‌పై వచ్చే ఛాన్సే లేదు. కానీ ఆ రైళ్లు ఎదురెదురుగా ఎలా వచ్చాయన్నదే ఎవరకీ అర్ధం కావడం లేదు. ఇందులో సాంకేతిక సమస్య ఉందా? లేదంటే స్టేషన్ మాస్టర్ తప్పిదం వల్లే ఇలా జరిగిందా? అనే దానిపై రాంచీ డివిజన్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చినప్పటికీ.. బ్రేకులు ఎందుకు పడలేదన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. బ్రేక్ ఫెయిల్యూర్ కూడా ప్రమాదానికి ఓ కారణమని అధికారులు భావిస్తున్నారు. అవి గూడ్స్ రైళ్లు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ ప్రయాణికుల రైళ్లు అయిఉంటే.. ఎంతటి ఘోరం జరిగేదో ఊహించుకోచ్చు. ఇప్పుడీ ప్రమాదంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. రెండు రైళ్లను ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా ఎలా అనుమతిస్తారని..అధికారులు మరీ అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  First published:

  Tags: Fire Accident, Train, Warangal

  ఉత్తమ కథలు