మీకు పుణ్యం ఉంటుంది... వర్షపు నీటిలో చిన్నారి వేడుకోలు... వైరల్ వీడియో

నీరు... నీరు... నీరు... అంటూ... రైతుల కష్టాల్ని చెబుతూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అవి సినిమాలు మాత్రమే... ఇదీ వాస్తవం అంటూ ఓ చిన్నారి చేసిన వీడియో... అందర్నీ కదిలిస్తోంది.

news18-telugu
Updated: September 21, 2020, 10:48 AM IST
మీకు పుణ్యం ఉంటుంది... వర్షపు నీటిలో చిన్నారి వేడుకోలు... వైరల్ వీడియో
వర్షపు నీటిలో చిన్నారి వరుణ్ వేడుకోలు (credit - twitter)
  • Share this:
నెటిజన్లు చాలా మంచి వాళ్లు. ఎందుకంటే... మంచి విషయాల్ని వాళ్లు ఎప్పుడూ వైరల్ చేస్తారు. తద్వారా... వాటి గురించి ప్రపంచానికి తెలిసేలా చేసి... బాధితులకు మేలు జరిగేలా చేస్తారు. తాజాగా అలాంటి ఓ ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. అదే... యాదాద్రి జిల్లా... వలిగొండ చిన్నారి వీడియో. ఈ మధ్య తెలంగాణలో గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కదా... అలాంటి వర్షాల వల్ల చాలా పంటలు మునిగిపోయాయి. వలిగొండ మండలంలోని... అరూరుకి చెందిన ఐలయ్య, చంద్రమ్మకు చెందిన 6 ఎకరాల వరి సాగు కూడా పూర్తిగా మునిగిపోయింది. ఎంతలా అంటే... అసలు అక్కడ ఇప్పుడు వరి చేలే కనిపించట్లేదు. పంటలన్నీ చెరువుల్లా మారిపోయాయి.

చెరువులా మారిన వరి చేనులో ఐలయ్య కొడుకు వరుణ్... నిలబడి వేడుకొనడం అందర్నీ కదిలిస్తోంది. వర్షం వల్ల తమ పంట పూర్తిగా నీట మునిగిందంటూ... ఆ చిన్నారి వాస్తవ పరిస్థితులు ఇలాగే ఉంటాయంటూ వేడుకున్నాడు. సరైన తూములు లేకపోవడంతో... వర్షపు నీరు తమ చెరువుల్లో రోజుల తరబడి ఇలాగే ఉండిపోతోందని వివరించాడు. తమ పంటకు పరిహారం ఇవ్వకపోయినా పర్వాలేదన్న చిన్నారి... ఇకపై ఎవరి పంటలూ ఇలా అవ్వకుండా చూడాలని కోరాడు. రైతన్నను అంతా గొప్పగా చెబుతారు గానీ... రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశాడు.వరి చేనులో ఉన్న ఆ పిల్లాడి మెడవరకూ వర్షపు నీరు చేరింది. అంతలా పంట మునిగిపోయింది. వరుణ్ చేసిన ప్రయత్నం ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. అందరూ ఆ చిన్నారి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. వరుణ్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 21, 2020, 10:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading