హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad: అధికారుల ముందు ఆత్మహత్యాయత్నం చేసిన రైతు.. 19 మంది గిరిజన మహిళల అరెస్ట్ - ఎందుకో తెలుసా ?

Adilabad: అధికారుల ముందు ఆత్మహత్యాయత్నం చేసిన రైతు.. 19 మంది గిరిజన మహిళల అరెస్ట్ - ఎందుకో తెలుసా ?

పోలీసుల అదుపులో మహిళలు

పోలీసుల అదుపులో మహిళలు

ఒకచోట అధికారుల ముందే ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని తన వ్యవసాయ భూమిలోనే ఆత్మహత్యా యత్నం చేశాడు. మరోచోట తమ విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో పోలీసులు 19 మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేశారు.

మరికొన్ని రోజుల్లో వానాకాలం పంటల సాగు మొదలు కానున్నది. ఇందుకోసం ఇప్పటి నుండే రైతులు (Farmers) వివిధ పనుల్లో తలమునకలై ఉన్నారు. ఓ పక్క తమ వ్యవసాయ భూములను చదును చేసి, అందులో వానా కాలం పంటలు వేసేందుకు సిద్దం చేసుకుంటున్నారు. మరోవైపు విత్తనాల సేకరణ, ఎంపిక, సాగు పెట్టుబడులు తదితర పనుల్లో మునిగితేలుతున్నారు. ఇదే సమయంలో వ్యవసాయమే (Agriculture) ప్రధాన వృత్తిగా చేసుకొని ఉపాధి పొందుతున్న ఓ రైతు అధికారుల ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి (A farmer who tried to commit suicide) పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆ అధికారులు ఒక్కసారిగా గాబార పడిపోయారు. మరోవైపు 19 మంది గిరిజన మహిళలను (Tribal women) తమ విధులకు ఆటంకం కలిగించారనే నెపంలో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఇంతకి ఆ రైతు ఎందుకు అలా అధికారుల ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు ? వచ్చిన ఆ అధికారులు ఎవరు ? ఎందుకు అక్కడికి వచ్చారు ? గిరిజన మహిళలు ఎవరి విధులకు ఆటంకం కలిగించారు ? వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు ? అన్న ప్రశ్నలు మీ మదిలో మెదులుతున్నాయి కదా. అయితే ఆ అనుమానాలు తీరాలంటే ఇది పూర్తిగా చదవండి..

భూమిని చదును చేసి  మొక్కలు నాటే కార్యక్రమం

ఉమ్మడి ఆదిలాబాద్  (Adilabad) జిల్లా వ్యాప్తంగా ఆదివాసి గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల (Podu lands) సమస్య ఇంకా చిక్కు వీడని ప్రశ్నలాగే ఉండిపోయింది. రోజురోజుకు జఠిలమవుతుందే తప్ప, దానికి పరిష్కారం లభించడం లేదు. మరోవైపు పోడు భూముల విషయమై ఇటీవల ఉమ్మడి జిల్లాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ (Komuram bheem Asifabad) జిల్లా పెంచికల్ పేట్ మండలం జైహింద్ పూర్ గ్రామ శివారులో పోడు భూముల రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లోకి వెళ్లి అటవీశాఖ అధికారులు ఆ భూమిని చదును చేసి  మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధపడ్డారు. దీంతో  జై హిందుపూర్ గ్రామస్తులు అటవి శాఖ అధికారులను అడ్డుకున్నారు. వచ్చిన అధికారులతో వాగ్వివాదానికి దిగారు.

ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుని ఉపాధి పొందుతున్న తమ భూములను అటవీశాఖ అధికారులు అక్రమంగా చదును చేస్తున్నారని పోడు భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అటవీ శాఖ అధికారుల (Forest Department officials) అక్కడి నుండి వెళ్లిపోకపోవడంతో ఓ పోడు రైతు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరకు అటవీ అధికారులు అడ్డుకొని రైతును కాపాడారు. ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మాకుల పేట పంచాయతీ పరిధిలోని కోయ పోచగూడ అటవీ శివారులో పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులను అటవీ అధికారులు అడ్డుకొని పోడు భూముల చుట్టూ కందకాలు తవ్వటంతో గిరిజన మహిళలు అడ్డుకున్నారు.

అధికారుల వైఖరిని నిరసితూ గిరిజనులు ఆందోళన చేయటంతో అక్కడి నుండి వెళ్ళిన అటవీ అధికారులు పోలిసుల సహాయంతో గ్రామానికి వెళ్లి అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో 19 మంది గిరిజన మహిళలను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు. అయితే ఈ భూములను తాము 2003 నుంచి సాగు చేసుకుంటున్నామని, తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఈ పోడు భూముల సమస్య చిక్కు వీడని ప్రశ్నలా మారింది. అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పోడు రైతులు ఆశతో దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా అందుకు మోక్షం లభించకపోవడంతో నిరాశచెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు పోడు రైతులు కోరుతున్నారు.

First published:

Tags: Adilabad forest, Farmers suicide, Forest

ఉత్తమ కథలు