Home /News /telangana /

A FARMER WAS DIED IN A THUNDER LIGHTNING STRIKE IN DHANORA VILLAGE IN ADILABAD DISTRICT ADB PRV

Rains: ఆదిలాబాద్​లో పిడుగుపాటు.. రైతు కుటుంబాన్నే రోడ్డున పడేసిన ఘటన.. ఏం జరిగిందంటే?

రైతు ఆశన్న (పైల్​)

రైతు ఆశన్న (పైల్​)

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరోవైపు భీంపూర్ మండలంలోని ధనోరా గ్రామంలో పిడుగు పడటంతో రోడ్డున పడింది.

    అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆకాశం మబ్బులతో నిండిపోయి వర్షించింది. చెమటలు పట్టిన మేనుకు చల్లటి గాలులతో కొంత ఊరట లభించింది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (Heavy rains) కురిసింది. ఈదురు గాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోయాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని ధనోరా గ్రామంలో పిడుగు పడి ఓ రైతు మృతి (Farmer died) చెందాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వివరాల్లోకి వెళితే… ధనోరా గ్రామానికి చెందిన గొస్కుల ఆశన్న (55) తన భార్య నర్మదతో కలిసి ఎప్పటిలాగే శనివారం కూడా పంట పొలంలో పనులు కోసం వెళ్ళారు. పంట చేనులో పత్తి విత్తనాలను విత్తున సమయంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో దంపతులిద్దరు కలిసి ఇంటికి బయలుదేరేందుకు సిద్దపడ్డారు. పక్కనే కొంత దూరంలో ఉన్నభార్య నర్మద కోసం ఆశన్న వేచి చూస్తుండగా ఒక్కసారి పిడుగు (Thunder) పడింది.

    పిడుగుపాటుతో రైతు ఆశన్న అక్కడికక్కడే మృతి చెందారు. పిడుగు పడిన సమయంలో భార్య దూరంలో ఉండటంతో ఆమెకు ప్రమాదం తప్పింది. తన కళ్ళముందే కట్టుకున్న భర్త మృత్యువాత పడటంతో మృతుడి భార్య నర్మద గుండెలవిసేలా రోధించింది. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి నలుగురు కూతుళ్ళు ఉన్నారు. అందరి పెళ్లిళ్ళు అయిపోయాయి. ఎస్.ఐ. రాధిక ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి పంపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



    24 గంట‌ల్లో తెలంగాణ‌లోకి రుతుప‌వ‌నాలు..

    మ‌రో 24 గంట‌ల్లో తెలంగాణ‌లోకి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ శనివారం అంచనా వేసింది. తదుపరి 2-3 రోజులలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు రుతుపవనాల మేఘాలతో కప్పబడి ఉంటాయి. దీని కార‌ణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని తెలిపింది. శనివారం జారీ చేసిన సర్క్యులర్‌లో, రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, కొంకణ్‌లోని చాలా ప్రాంతాలు (ముంబయితో సహా), మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని పేర్కొంది.

    IMD జూన్ 12 నుండి 15 వరకు కొన్ని జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో 30-40 kmph వేగంతో మెరుపులు మరియు ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలోనే 'పసుపు' హెచ్చరికల‌ను జారీ చేసింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో శనివారం కూడా వేడిగాలులు వీస్తాయ‌ని హెచ్చ‌రించింది. అయితే,రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. ఇక హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండగా, రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకునే సరికి అవి బాగా పడిపోతాయని భావిస్తున్నారు. శనివారం, నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 37.3º సెల్సియస్ నమోదైంది. ఇది సాధారణం కంటే 2ºC ఎక్కువగా ఉంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Farmer, Heavy Rains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు