Home /News /telangana /

A FARMER PROTEST IN FRONT OF RTC BUS FOR NOT TAKING HIM AT NAGARKARNOOL VRY MBNR

Nagarkarnool : రైతు వినూత్న నిరసన.. తనను తీసుకుపోని బస్సుకు అడ్డంగా పండ్ల బుట్టలు,

బస్సుకు అడ్డంగా రైతు

బస్సుకు అడ్డంగా రైతు

Nagarkarnool : తాను పండించిన పండ్లను మార్కెట్‌కు తీసుకువెళ్లకుండా నిరాకరించిన బస్సు డ్రైవర్‌పై కోపంతో ఓ రైతు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. బస్సు కదలకుండా రోడ్డు అడ్డగా తన పండ్ల బుట్టలను పెట్టి ధర్నా నిర్వహించాడు.

    నాగర్ కర్నూలు జిల్లాలోని, పెద్దకొత్తపల్లి మండలం, మారేడు మాన్ దిన్నె గ్రామం... నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం... ఈ గ్రామానికి కేవలం ఒకే ఒక బస్సు వెళుతుంది... అయితే గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను ప్రతినిత్యం కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకువెళ్లి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు...

    ఈ క్రమంలోనే రోజువారీగా శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టుకోగా, తనకు ఉచితంగా రైతు పండ్లు ఇవ్వలేదని ఆగ్రహంతో ఆ బస్సు డ్రైవర్ కోపంతో ఆ రైతు పండించిన బొప్పాయి పండ్లను బస్సులోకి ఎక్కించుకోలేదు... దీంతో బస్సు ఆపకుండానే నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు... దీంతో ఆవేదనకు లోనైన రైతు గోపయ్య ఆ బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో, రోడ్డుపై బొప్పాయి పండ్లతోపాటు ఇలా బైఠాయించి, గంట పాటు నిరసన వ్యక్తం చేశాడు. దీంతో బస్సు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. కాగా జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో బస్సు డ్రైవర్స్ రైతుల సరుకులను డబ్బులు తీసుకుని రవాణా చేస్తుండేవారు. అయితే కార్గో సర్వీసులు వచ్చిన తర్వాత ఏ వస్తువులైన రికార్డెడ్‌గానే వెళుతున్నాయి. దీంతో నిజంగానే రైతు చెప్పినట్టు ఉచిత పండ్లు ఇవ్వలేదని తీసుకుని వెళ్లలేదా లేదంటే నిబంధనలకు అనుగుణంగానే పండ్లను తీసుకుని వెళ్లలేదా అనేది విచారణలో తేలనుంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Mahabubnagar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు