Karimnagar : ప్రధాని మోడి పిలుపునందుకున్న రైతు... పొలంలోనే దేశం... ..జాతీయ జెండా ఆవిష్కరణ

వరి పొలంలో జెండా ఆవిశ్కరణ

Karimnagar : ప్రధాని నరేంద్రమోడి పిలుపు మేరకు ఓ రైతు స్పందిచాడు. తన వ్వవసాయ పొలంలోనే భారత దేశ పఠాన్ని రూపొందించాడు..అక్కడే జాతీయా జెండాను ఆవిష్కరించి..సంవత్సరం పొడవునా వందన సమర్పణ చేసేందుకు సిద్దమయ్యాడు.

  • Share this:


    భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ నెల 15 వ తేదితో 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశమంతా అజాది అమృత్ మహోత్సవాలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మల్లికార్జున్ రెడ్డి వినూత్నంగా అలోచించి దేశ భక్తిని చాటుకుంటున్నాడు.మల్లికార్జున్ రెడ్డి ఇప్పటికే వ్యవసాయం లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అద్భుత ఫలితాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. అదే స్ఫూర్తి తో మరోసారి అందరిలో ఒక్కడిగా నిలవాలని తాను నమ్ముకున్న వ్యవసాయ వరి పొలంలో 20 గుంటలలో నల్లని వరితో (కాల బట్టి ) భారత దేశ చిత్రపటం వచ్చే విధంగా వరి నాటాడు.

    ఆయన వరి పటం తాజాగా అందరిని ఆకట్టుకుంటుంది. కాగా భారత దేశ చిత్రపటం అనేక రూపాల్లో వేసిన వారు ఉన్నారు... అయితే వరిపొలంలో వేయడంతో రైతు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు..మరోవైపు చిత్రపటాన్ని వేయడంతోపాటు గ్రామంలోని దేశభక్తి పెంపోందించే విధంగా ఆయన చర్యలు చేపట్టాడు.. ఈ క్రమంలోనే రేపటి స్వాతంత్ర్య దినోత్సం నుండి వచ్చే సంవత్సరం వరకు..సంవత్సరం పొడవునా.. జాతీయ గీతం పాడడంతోపాటు ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయంత్రం వితరణ చేయనున్నట్లు మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. అయితే దీనీ ద్వారా దేశభక్తితోపాటు తాను పండిస్తున్న సేంద్రియ ఎరువుల పంటలపై కూడా ప్రజల్లో సరైన అవగాహాన వస్తుందంటున్నారు..సేంద్రీయ ఎరువుల పంటలతో ఆరోగ్యంగా ఉండడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.

    కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే చాలా మంది యువత స్వచ్చంద సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు అజాది అమృత్ మహోత్సవాలను జరుపుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవున అజాది అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుంది.
    Published by:yveerash yveerash
    First published: