Home /News /telangana /

A FAMILY SOLD THEIR OWN HOUSE FOR CORONA TREATMENT AND LIVING AS TENANT IN THE SAME HOUSE VRY

Hyderabad : కరోనా ధాటికి కుటుంబం విలవిల .. ఇల్లు అమ్ముకుని అదే ఇంట్లో కిరాయకు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల‌కూ వ‌ణుకు పుట్టించిన మ‌హ‌మ్మారి కోవిడ్‌-19 వైర‌స్‌ని ఎవ‌రు సృష్టించార‌నే ప్ర‌శ్న‌కు ఇంత‌వ‌ర‌కూ ఒక స్ప‌ష్ట‌మైన స‌మాధానం దొర‌క‌లేదు. అయితే చైనాలోని వూహాన్ నుంచే ఈ వైర‌స్ వ్యాప్తి ఆరంభ‌మ‌య్యింద‌ని దాదాపుగా అందరూ న‌మ్ముతున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల‌కూ వ‌ణుకు పుట్టించిన మ‌హ‌మ్మారి కోవిడ్‌-19 వైర‌స్‌ని ఎవ‌రు సృష్టించార‌నే ప్ర‌శ్న‌కు ఇంత‌వ‌ర‌కూ ఒక స్ప‌ష్ట‌మైన స‌మాధానం దొర‌క‌లేదు. అయితే చైనాలోని వూహాన్ నుంచే ఈ వైర‌స్ వ్యాప్తి ఆరంభ‌మ‌య్యింద‌ని దాదాపుగా అందరూ న‌మ్ముతున్నారు.

Hyderabad : కరోనా కల్లోలం అనేక లక్షల జీవితాలను రోడ్డు పడేస్తుంది..చికిత్స కోసం సంపాదించుకున్న ఆస్తులు అమ్ముకోవడం లేదా అప్పులు తెచ్చి కరోనా చికిత్స చేయించుకున్న వారు అనేక మంది ఉన్నారు...ఇలా జిల్లాల నుండి నగరానికి వచ్చి ఇల్లు కొనుకున్న ఓ కుటుంబం కరోనా కారణంతో అమ్ముకుని తిరిగి అదే ఇంట్లో కిరాయికి ఉన్న దీన స్థితికి నెట్టివేయబడ్డారు.

ఇంకా చదవండి ...
కరోనా రాష్ట్రంలో అనేకమంది కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్‌తో పలు కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోవడంతో ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు..తాము జీవితాంతం చెమడోడ్చి కూడబె్ట్టుకున్న డబ్బంతా కరోనా వ్యాధికోసం ఖర్చు చేస్తోన్న పరిస్థితి నెలకొంది..ఆసుపత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.. కరోనా నుండి బయటపడేందుకు తమకు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టడం లేదా అమ్ముకోవడం లాంటీ సంఘటనలను కరోనా మోసుకువస్తోంది..దీంతో ఇలా ఓ కుటుంబం తమ జీవితాంతం కూడబెట్టుకుని కొనుక్కున్న ఇళ్లును తాజాగా భార్యభర్తలు కరోనా భారిన పడడంతో ఇళ్లు అమ్మి చికిత్స పోందారు. అదృష్టవశాత్తు ఇద్దరు బతికి బట్టకట్టినా...తాము కొనుకున్న ఇంట్లోనే కరోనా మహమ్మారి కారణంగా కిరాయిదారులుగా మిగిలిపోయారు.

ఇలా తెలంగాణ జిల్లాల నుండి పొట్ట చేతపట్టుకుని నగరానికి చేరుకున్న వారు సంవత్సరాల తరబడి నగరంలో ఉంటూ భార్యభర్తలు కష్టపడి డబ్బులు కూడబెట్టుకున్న వారు చివరకు కరోనాతో అప్పులపాలు అయి తిరుగు ప్రయాణం అవుతున్నారు..ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లాకు చెందిన ఓ జంట 10 సంవత్సరాలుగా హైదరాబాద్‌ మియాపూర్‌లో ఉంటూ హోటల్ నడుపుతున్నారు..తాము సంపాదించిన దాంతో ఓ ప్లాట్ కూడ కొనుక్కున్నారు.
దీంతో జీవితం సాఫిగా సాగుతుందకుంటున్న సమయంలో కరోనా వారి జీవితాల్లో కల్లోలం నింపింది.

కొద్ది రోజుల క్రితం కరోనా తన భార్య కరోనా పడింది. దీంతో ఆమెను బ్రతికించుకోవడం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించాడు..ఇందుకోసం తన స్నేహితుడి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తెచ్చాడు...కాని అవి సరిపోకపోవడంతో బయట ప్రయత్నాలు చేశాడు..కాని కరోనా కాలంలో అప్పులు పుట్టడడం కష్టంగా తయారు కావడంతో తన స్వంత ఇంటిని అమ్మెందుకు నిర్ణయించాడు. దీంతో 25 లక్షలకు ఇంటిని అమ్మాడు..అయితే ఆ ఇంటిని అమ్మిన తర్వాత ఇట్లోనే కిరాయకు ఉంటామని అనుమతి తీసుకున్నాడు. అదృష్టవశాత్తు కొద్ది రోజుల తర్వాత భార్య కరోనా నుండి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చింది..కాని తాను కన్న కలలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇలా కరోనా తో లక్షల రూపాయలు ఖర్చు చేసిన కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉంటారనడంలో సందేహం లేదు..చాలా మంది అప్పులు తేవడం లేదా ఆస్తులు అమ్ముకుని , తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు కాపాడుకున్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు