సర్కర్ కంపెనీ ఆఫర్ ఇస్తే.. సరస్వతీ కటాక్షం కోసం కోరుకున్న ఓ మరుగుజ్జు కథ..

భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయుడు కావాలని ల‌క్ష్యంగా పెట్టుకున్నాన‌ని ర‌ఫ‌త్ చెపుతున్నాడు. అందుకోసం ఎంత క‌ష్టామైన‌ స్కూల్ కు క్రమం తప్పకుండా వెళుతున్నాన‌ని అంటున్నాడు.

news18-telugu
Updated: August 25, 2019, 7:57 PM IST
సర్కర్ కంపెనీ ఆఫర్ ఇస్తే.. సరస్వతీ కటాక్షం కోసం కోరుకున్న ఓ మరుగుజ్జు కథ..
స్కూలుకు వెళ్తున్న రఫత్
  • Share this:
సాధించాల‌నే ప‌ట్టుద‌ల ముందు ఆంగవైకల్యం చిన్నబోయింది. విధి చిన్న చూపు చూసినా జ్ఞాన‌కటాక్షం లభించింది. మొక్క‌వోని ధైర్యంతో తోటివారితో పోటీ ప‌డుతూ ముందుకు సాగుతున్నాడు. చ‌దువుపై మక్కువ‌తో అంగ‌వైక‌ల్యం స‌హ‌క‌రించ‌కపోయినా క‌ష్టాన్ని స‌హితం లెక్క‌చేయకుండా విద్యను ఆభ్య‌సిస్తున్నాడు మ‌రుగుజ్జు. మ‌రుగుజ్జు అంటే అందరికీ చిన్న‌చూపు. కానీ అందరితో స్నేహంగా ఉంటూ తాను మ‌రుగుజ్జు అన్న విష‌యాన్ని మ‌ర్చిపోతున్నాడు. బడికి పరుగు పరుగున వస్తున్న ఈ చిన్నోడే రఫత్... నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లికి చెందిన హైమద్- ర‌జియాబేగం తొలి సంతానం ర‌ఫ‌త్. రఫత్ మరుగుజ్జుతనం చూసి.. ఓ సర్కస్ కంపెనీ వారు అతనికి సర్కస్ లో అవకాశం కల్పించేందుకు ముందుకు వ‌చ్చారు.. అయితే తల్లిదండ్రులు తమ కొడుకును సర్కస్ కు పంపేందుకు నిరాకరించారు. రఫత్ అందరిలా లేకున్నా , చదువంటే ఆ చిన్నోడికి ప్రాణం. క్రమం తప్పకుండా స్కూల్ కు వెళ్లడం రఫత్ కు చిన్నప్పటి నుంచి అలవాటు. ప్రస్తుతం కుర్నాపల్లి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం రఫత్ తల్లి రజియాబేగం అనారోగ్యంతో మృతిచెందింది. అప్ప‌టి నుంచి ర‌ఫ‌త్ ను తండ్రి, తాత చూసుకుంటున్నారు. అయితే తండ్రి కూలీ ప‌నిచేసుకుంటు కుటుంబాన్నిపోషించుకుంటున్నాడు. అయితే ర‌ఫ‌త్ ను ప్ర‌తి రోజు స్కూల్ కు తీసుకు వెళ్లడం కుద‌రదు. దీంతో ర‌ఫ‌త్ కు స్కూల్ కు రావ‌డం క‌ష్ట‌మవుతుంది.

రఫత్


రఫత్ అందరి పిల్లల్లా ఎత్తు పెరగలేడు. అందరిలా పరిగెత్తలేడు. కానీ చదువు, ఆటల్లో తన తోటి స్నేహితులతో పోటీ పడతాడు. కబడ్డీ కూత పెట్టినా.. కూతతో తన దగ్గరికి ఎవరైనా వచ్చినా పట్టు పడితే ఉడుంపట్టులా విడిచిపెట్టడు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న రఫత్ కు రాయడం రాదు. చేతులు, కాళ్లు వంకర్లు తిరిగి ఉండటంతో.. తినడానికి కూడా ఇబ్బందే. వేళ్లతో కాకుండా చేయి మట్టతో తింటున్నాడు. మరుగుజ్జుగా ఉన్నా తనకు వైకల్యం ఉందని ఎప్పుడు ఫీల్ కాడని తోటి విద్యార్ధులు చెబుతున్నారు. వయస్సుకు తగినట్టుగా చదువు కొనసాగించలేనప్పటికీ పాఠశాలలో చురుగ్గానే వుంటాడని ఉపాధ్యాయులు రఫత్ చురుకుదనాన్ని మెచ్చుకుంటున్నారు. ర‌ఫ‌త్ కు కాళ్లు సరిగా లేక చెప్పులు వేసుకునే పరిస్ధితిలేదు. అయితేనేం ఇసుక, గులకరాళ్లు, పాదాలకు గుచ్చుతున్నా.. ఇష్టంగా భరిస్తూ స్కూల్ కు పరుగులు పెడతాడు. భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయుడు కావాలని ల‌క్ష్యంగా పెట్టుకున్నాన‌ని ర‌ఫ‌త్ చెపుతున్నాడు. అందుకోసం ఎంత క‌ష్టామైన‌ స్కూల్ కు క్రమం తప్పకుండా వెళుతున్నాన‌ని అంటున్నాడు. త‌న‌కు స్కూల్ కు రావడం ఇబ్బందిగా ఉందని.. ఎవరైనా మూడు చక్రాల సైకిల్ ఇప్పించాలని అభ్యర్ధిస్తున్నాడు.

(పి.మ‌హేంద‌ర్, నిజామాబాద్, న్యూస్18 తెలుగు)First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు