Home /News /telangana /

A DOCTOR DISAGREE TO PREGNANT DELIVERY WHO HAS CORONA POSITIVE VRY

Telangana news : పేరుకే ప్రచారమా...? లోపలికితే డొల్లతనమేనా.. గర్భిణిలకు కరోనా సోకితే ఇంతేనా...?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana news : నిండు గర్భిణి పురిటి నొప్పులు పడుతుంటే ఆ వైద్యునికి నిబంధనలు అడ్డువచ్చాయి.. సౌకర్యాలు లేవని ప్రసవం చేయకుండా చేతులెత్తాశాడు.. ఆ వైద్యుడి అంత్యంత హేయమైన నిర్ణయానికి ఆ గిరిజన మహిళ ఆసుపత్రి గేటు ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇంకా చదవండి ...
  కరోనా ధర్డ్ వేళ మరోసారి కాబోయో తల్లులకు కష్టకాలంగా మారింది. రెండు కరోనా వేవ్‌ల నుండి అనేక పాఠాలు నేర్చుకున్నామని చెబుతున్న వైద్య రంగం నిబద్దత, అధికారుల నిర్లక్ష్యం వెరసి నిండు గర్భిణిలు ఉసురు తీస్తున్నాయి.. పేరుకే ఎంతో ప్రచారం.. తీరా ఆసుపత్రికి వస్తే మాత్రం అసలు డొల్లతనం బయటపడదు.. సర్కారు వైద్యం ఎంతో మెరుగుపడిందని బాకలు ఊదుతున్న నేతల ముందు వైద్యుల ప్రవర్తన, భావితరాలకు బిడ్డలనందించే తల్లుల పాలిట నరకంగా మారుతుంది..

  కోవిడ్ పేరుతో గర్భం దాల్చిన వారిని నిర్లక్ష్యానికి గురి చేసిన దౌర్భాగ్యమైన సంఘటనలు గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి.. అయితే కారణాలు ఏవైనా వైద్యుల తీరు, ఆసుపత్రి పాలనాధికారుల వ్యవహారం వెరసి గర్భిణిల ప్రసవ వేదన మిన్నంటుతోంది. కరోనా పేరుతో వారిని కనీసం దగ్గిరికి కూడా రానీయని దయనీయ పరిస్థితి మరోసారి చోటు చేసుకుంది. దీంతో ఆ గర్భిణి ఆసుపత్రి గేటు ముందే ప్రసవించాల్సిన అనాగరికమైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.

  వివరాల్లోకి వెళితే...జిల్లాలోని బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన నిమ్మల లాలమ్మ మంగళవారం ఉదయం 8 గంటలకు నొప్పులతో బాధపడతూ ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి చేరింది.. వైద్యుల సూచన మేరకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్​గా తేలింది. కొవిడ్ సోకిందని తేలడంతో నొప్పులతో బాధ పడుతున్నా, నిండు గర్భిణిని వైద్యాధికారులు ఆసుపత్రిలోకి అనుమతించలేదు. పీపీఈ కిట్లు లేవని, వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా విధుల్లో ఉన్న వైద్యులు సూచించారు. నొప్పులు తీవ్రమైనా సిబ్బంది పట్టించుకోలేదు...కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక ప్రసవ వేదన పడుతున్ననిండు గర్భిణిని ఆమె అక్కలు అలివేల, రాజేశ్వరి, ఆసుపత్రి గేటు వద్ద ఓ మూలకు తీసుకువెళ్లారు. అక్కడే ప్రసవం చేయించారు.  Brother and sister love : తండ్రి ఒక్కడే.., తల్లులు వేరు.. కాని అన్నా చెల్లెల్ల మధ్య..

  అయితే సంఘటన జరిగిన తర్వాత విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.ఆ తర్వాత మీడియాకు రావడంతో మంత్రి హరీష్ రావు స్పందించారు. కరోనా పేరుతో వైద్యం ప్రసవం చేయని వైద్యునిపై చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏకంగా గతంలో కరోనా సోకిన గర్భిణిలకు కూడా వైద్యం చేయాలని నిబంధనలతో పాటు మంత్రి హరీష్ రావు ఆదేశించినా.. వైద్యులు మాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది.. అంటే కరోనా రోగుల పట్ల ఇప్పటికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల్లో ఏమేరకు అవగాహాన ఉందనేది ఈ సంఘటన ద్వార మరోసారి బయటపడింది. అయితే చాలా మంది గర్భిణిలకు వైద్యులు ముందుకు వచ్చి పెద్ద సహాసమే చేశారు.. వారికి కూడా ప్రసవం చేయవచ్చని ధైర్యంగా నిరూపించారు. కాని కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం ఆ రంగాన్ని విమర్శలు పాలు చేస్తోంది.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Corona, Nagarkarnol district

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు